వర్సిటీ ఏర్పాటుతోనే అంబేద్కర్‌కు గౌరవం

వర్సిటీ ఏర్పాటుతోనే అంబేద్కర్‌కు గౌరవం


 ఐడియా రాష్ట్ర అధ్యక్షుడు గోళ్లమూడి రాజసుందరబాబు

 

 గుంటూరు ఈస్ట్

 కొండపై అంబేద్కర్ విగ్రహం స్థాపించి, మందిర నిర్మాణం చేపట్టడంతోపాటు కొండ దిగువన దళితులకు అంతర్జాతీయ స్థారుు యూనివర్సిటీని ఏర్పాటు చేసిననాడే రాజ్యంగ నిర్మాతకు నిజమైన గౌరవం ఇచ్చినట్లని ఐడియా రాష్ట్ర అధ్యక్షుడు గోళ్లమూడి రాజసుందరబాబు అన్నారు. పైలక్ష్యాల సాధన కోసం ఇద్వా, ఐడియా, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్, నేషనల్ దళిత స్టూడెంట్ యూనియన్‌ల ఆధ్వర్యంలో దళిత నేతలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.



అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠారుుంచారు. ఈ సందర్భంగా రాజసుందరబాబు మాట్లాడుతూ జనవరి 26 న జరిగే గణతంత్ర వేడుకల్లో అధికారులు, పాలకులు అంబేద్కర్ కృషి గురించి ఒక్కమాటైనా చెప్పకపోవటం ఆయనను కించపరచడం కాదా? అని ప్రశ్నించారు. గిరిజన వర్సిటీలానే దళితుల కోసం ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయూలన్నారు. దీనికోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించాలన్నారు. కొండపై అంబేద్కర్ విగ్రహం, మందిరం, మెట్లు, ఘాట్ రోడ్ల నిర్మాణానికి రూ.5 కోట్లు, ఏటా అంబేద్కర్ తిరనాళ్ల నిర్వహణకు రూ.2 కోట్లు మంజూరు చేయూలన్నారు.



గుంటూరు నగరంలో పది వేలు, జిల్లా వ్యాప్తంగా 1000 గ్రామాల్లో 50 వేల మంది నిరుపేదలకు జి+1 తరహా అపార్టుమెంట్లు నిర్మించి రాజధానిలో దళితులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. కేబినెట్ విస్తరణలో దళితులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.



ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఫైనాన్స్ కార్పొరేషన్‌లకు పాలకవర్గాలను నియమించకపోతే సంక్షేమ పథకాలు ఎలా అమలవుతాయని ప్రశ్నించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కొర్రపాటి చెన్నకేశవులు, ఆంధ్ర దళిత ఫ్రంట్ మాజీ కార్యదర్శి కె.రమేష్, పాలేటి మేరి రాణి, నేషనల్ దళిత విద్యార్థి యూనియన్ రాష్ట్ర నేతలు చందు, చిరంజీవులు, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు పి.అరుణశాస్త్రి, దాసు తదితరులు ప్రసంగించారు.



 కలెక్టర్ స్పందన.. ధర్నా గురించి తెలుసుకున్న కలెక్టర్ కాంతిలాల్ దండే తన బంగ్లా నుంచి బయటకు వ చ్చి ఆందోళనకారుల డిమాండ్లను సావధానంగా విన్నారు. దళితులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం అవసరమేనంటూ డిమాండ్ పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతానని హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top