చెదిరిన కలలు


ప్రాణం తీసిన అతివేగం

చెట్టును ఢీకొన్న కారు

అందులో ప్రయాణిస్తున్న ఇద్దరి మృతి

ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న మరొకరు




పేగు తెంచుకు పుట్టిన బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు... వారి ఎదుగుదలకోసం ఎంతో పాటుపడ్డారు. ఉన్నత చదువులు చదివించారు. వారి భవిష్యత్తుకోసం ఎన్నో కలలు కన్నారు... కానీ విధి వక్రీకరించింది. కన్నోళ్ల కలల్ని కల్లలు చేసి వారు అందని తీరాలకు వెళ్లిపోయారు. అతివేగం వారి పాలిట మృత్యుపాశం అయ్యింది.  చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్లముందే విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి ఆ కుటుంబాలు అచేతనంగా మిగిలిపోయాయి.



శృంగవరపుకోట : విశాఖ –అరుకు రోడ్డులో గురువారం రాత్రి ఏఓ హోమ్స్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడగా మరో యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. హృదయ విదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో రాంనగర్‌లో నివాసం ఉంటున్న పట్నాల చక్రధర్‌ ఎంబీఏ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ పనులు చేస్తున్నాడు. మూడు నెలలుగా నరవ వద్ద ఉన్న జ్ఞానగమ్య పాలిటెక్నిక్‌ కళాశాలలో పనులు చేస్తూ, తన కారును అదే కళాశాలకు అద్దెకు పెట్టి రోజూ పుణ్యగిరిరోడ్డులో నివాసముంటున్న తన స్నేహితుడు తోలాపు ప్రవీణ్‌కుమార్‌తో కలసి కాలేజీకి వెళ్లి రాత్రి ఎస్‌.కోట వచ్చేవారు.



అదే కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న గంట్యాడ మండలం వసంత గ్రామానికి చెందిన కె.ప్రవీణ్‌(27)తో కలిసి గురువారం రాత్రి నరవ నుంచి తాటిపూడి మీదుగా వారు కారులో ఎస్‌.కోట బయల్దేరారు. కారు యజమాని పట్నాల చక్రధర్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా రాత్రి 10గంటల సమయంలో ఎస్‌.కోట పరిసరాలకు చేరుకున్నారు. స్థానిక ఏఓ హోమ్స్‌ వద్ద సరిగ్గా 10.06గంటల సమయంలో రోడ్డు పక్క ఉన్న తాటిచెట్టును  బలంగా ఢీకొట్టారు.



 దీంతో కారు నుజ్జునుజ్జు అయి కారులో ఉన్న ముగ్గురూ చెల్లాచెదురుగా పక్కన ఉన్న పొలాల్లో పడిపోయారు. ప్రమాదంలో చక్రధర్‌ కాలు తెగి రోడ్డుపై పడిపోగా, మాంసపు ముద్దలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ప్రమాద సమయంలో కారు స్పీడోమీటర్‌ 140కి.మీ వద్ద లాక్‌ అయ్యిం ది. దీంతో అతివేగమే వీరి ప్రాణాలు తీసిందని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.



ఆశలు ఆవిరి

పట్నాల చక్రధర్‌ తండ్రి వేపాడ ఎమ్పీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. వీరు రాంనగర్‌లో నివాసం ఉంటున్నా రు. ప్రమాదంలో కాలు కోల్పోయిన చక్రధర్‌ గురువారం రాత్రి 2.30గంటల సమయంలో విశాఖలో ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయాడు. గంట్యా డ  మండలం వసంత గ్రామానికి చెందిన కె.ప్రవీణ్‌(27)నరవ వద్ద ఉన్న జ్ఞానగమ్య పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌గా (27) పని చేస్తున్నాడు. అతడు ఎస్‌.కోటలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించే సమయానికే ప్రాణాలు కోల్పోయాడు. ఇక మూడో వ్యక్తి తోలాపు ప్రవీణ్‌కుమార్‌ ఇంటర్‌ చదివా డు. ఇతని తల్లి స్థానిక పీఆర్‌ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఈయన ప్రస్తుతం విశాఖ ఓమినీకేర్‌ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. వీరు ముగ్గురి కి వివాహం కాలేదు. మొత్తమ్మీద ఇద్దరు మృతులూ కన్నవారి ఆశల్ని కల్లలు చేశారు.



పోలీస్‌ సేవలు భేష్‌ :

ప్రమాద వార్త తెలిసిన 5నిమిషాల్లో ఎస్‌ఐ ఎ.నరేష్, కానిస్టేబుళ్లు ప్రతా ప్, విక్కీ, అప్పారావుతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. వర్షం, చీకటిలో రోడ్డుపై ఎక్కడా ఎవ్వరూ లేక పోవటంతో సెల్‌ వెలుతురులో వారు దేహాలకోసం వెదికారు. మోకాలి లో తు బురదలో పడిఉన్న వారిని ఎస్‌ఐ నరేష్‌ స్వయంగా మోçసుకొచ్చి 108లో, పోలీస్‌జీప్‌లో ఎస్‌.కోట ప్రైవేటు ఆస్పత్రికి చేర్చారు. గాయాలతో ఉన్న చక్రధర్, ప్రవీ ణ్‌కుమార్‌లకు ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్కార్ట్‌ ఇచ్చి విశాఖ తరలించారు. ఎస్‌ఐ నరేష్‌ మాట్లాడుతూ ఎంత కష్టపడినా ఇద్దరి ప్రాణాలు కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top