మెదక్లో టీఆర్ఎస్, నందిగామలో టీడీపీ ముందంజ


హైదరాబాద్ : మెదక్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. టీఆర్‌ఎస్‌కు 4710 ఓట్లు, కాంగ్రెస్‌కు 1840 ఓట్లు, బీజేపీకి 1710 ఓట్లు వచ్చాయి. ఇక మెదక్‌ లోక్‌సభకు మొత్తం 22 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా టీఆర్‌ఎస్-10, బీజేపీ-9, కాంగ్రెస్-1, రెండు తిరస్కరణకు గురయ్యాయి.


 


మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. ఇక కృష్ణాజిల్లా నందిగామలో తొలి రౌండ్లో  టీడీపీ ముందంజలో ఉంది. మొదటి రౌండ్‌లో టీడీపీకి 5680 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ టీడీపీకి కేవలం కాంగ్రెస్ మాత్రమే ప్రత్యర్థి.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top