ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ ప్రారంభం

ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ ప్రారంభం - Sakshi

  •      తొలిరోజు 498 మందికి అడ్మిషన్లు పూర్తి

  •      పెండింగ్‌లో ఇద్దరి అడ్మిషన్లు

  •      21 మంది గైర్హాజరు

  • నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలకు కలిపి 2,807 మందిని ఎంపిక చేశారు. వారిలో నూజివీడు ట్రిపుల్ ఐటీకి 936 మందిని కేటాయించారు.



    తొలిరోజు 525 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ కౌన్సెలింగ్ ప్రశాంతంగా కొనసా గింది. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి, ఫీజులు వసూలుచేశారు. ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ ఇబ్రహీం ఖాన్, ఓఎస్‌డీ రామకృష్ణారెడ్డి, పీఆర్వో వీరబాబు  పర్యవేక్షణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా కౌన్సెలింగ్ జరిగింది. సీనియర్ ప్రొఫెసర్లు పరిమి రామ నర్సింహం, హనుమంతరావు ఈ ప్రక్రియకు సహకరించారు.



    అకడమిక్ కన్సల్టెంట్ రాజగోపాల్‌రెడ్డి, అసిస్టెంట్ చెన్నారెడ్డి కౌన్సెలింగ్ హాలులో ఉండి సర్టిఫికెట్ల పరిశీలనలో సిబ్బందికి ఎదురైన సందేహాలను నివృత్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులధృవీకరణ పత్రాలను ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ అధికారులు పరిశీలించి నిర్ధారించారు. తొలిరోజు కౌన్సిలింగ్‌లో 498 మందికి ప్రవేశాలను ఖరారు చేశారు. ఇద్దరి ప్రవేశాలను ప్రవేశాలను పెండింగ్‌లో ఉంచారు.

     

    21మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం 12కౌంటర్లు ఏర్పాటు చేసి 80మంది సిబ్బందిని నియమించారు. 30 మంది ఎన్‌సీసీ విద్యార్థులు కూడా సేవలందించారు. తాగునీరు, ప్రథమ చికిత్స కౌంటర్లు, ఎన్‌సీసీ క్యాడెట్ల సేవలు అందుబాటులో ఉండటంతో అంతా సజావుగా సాగింది. విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. మిగిలిన విద్యార్థులకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

     

    పెండింగ్ వివరాలు



    ఆంధ్రా రీజియన్‌కు చెందిన కె.రమ్యను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ కింద ఎంపికచేశారు. దీంతో ఆమె అడ్మిషన్‌ను పెండింగ్‌లో ఉంచారు.

     

    శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుడ్డు మౌనిక 4వ తరగతి నుంచి 10వ తరగతి లోపు ఇతర రాష్ట్రాల్లో మూడేళ్లు చదువుకుంది. ఏడేళ్లు ఒకే ప్రాంతంలో చదివితేనే లోకల్‌గా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆమె అడ్మిషన్‌ను కూడా పెండింగ్‌లో ఉంచారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top