మహానేతకు స్మృత్యంజలి

మహానేతకు స్మృత్యంజలి - Sakshi


వాడవాడలా ఘన నివాళి

పాలు, పండ్లు, దుస్తులు పంపిణీ

పలుచోట్ల అన్నదానం..

 వైఎస్ సేవలను స్మరించుకున్న శ్రేణులు


 

విశాఖపట్నం:  మహానే త, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరవ వర్ధంతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన వివిధ వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలను, సేవలను స్మరించుకున్నారు. ఇటు నగరంలోనూ, అటు జిల్లాలోనూ ఉదయం నుంచే పలు సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. తమ తమ ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఆయన  చిత్రపటాలకు పూలమాలలు వేశారు. పేదలు, వృద్ధులకు పండ్లు, వస్త్రాలు, దుస్తులు, విద్యార్థులకు యూనిఫారాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు వంటివి పంచారు. వైఎస్ స్మారకార్థం పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ నగర ం బీచ్‌రోడ్డులో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, కార్యదర్శులు కంపా హనోకు, జాన్‌వెస్లీ, నియోజకవర్గాల సమన్వయకర్తలు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, ప్రొఫెసర్ ఒ.ఆర్.రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జగదాంబ జంక్షన్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.



కార్యక్రమంలో అమర్‌నాథ్, దక్షిణ సమన్వయకర్త కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తర నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త తైనాల విజయకుమార్ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. వృద్ధులకు పండ్లు, రొట్టెలు, పేదలకు బియ్యం, చీరలు పంపిణీ చేశారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు దుస్తులు, బియ్యం పంపిణీ చేశారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మద్దిలపాలెం, హెచ్‌బీ కాలనీలో వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించారు. మంగాపురం కాలనీలో ఆటో డ్రైవర్లకు యూనిఫాంలు, ఆరిలోవలో క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. గాజువాక నియోజకవర్గంలో సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తిప్పల గురుమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎ.ఆదీప్‌రాజ్ నేతృత్వంలో వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించారు. భీమిలి మండలం టి.నగరంపాలెంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కె.నగరంపాలెంలో అన్నదానం, దుస్తుల పంపిణీ, ప్రభుత్వాస్పత్రిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు.



కార్యక్రమంలో సమన్వయకర్త కర్రి సీతారాం, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లిలో వైఎస్ విగ్రహాలకు పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు నే తృత్వంలో నాయకులు, కార్యకర్త లు నివాళులర్పించారు. పాలు, రొ ట్టెలు వంటివి పంచారు. కశింకోట లో పార్టీ అధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీని వాస్, మళ్ల బుల్లిబాబు తదితరుల ఆధ్వర్యంలో మహానేతకు అంజలి ఘటించారు. చోడవరంలో సమన్వయకర్త కరణం ధర్మశ్రీ వైఎస్ విగ్రహానికి  క్షీరాభిషేకం చేశారు. రావికమతం భారీ అన్నసమారాధన నిర్వహించారు. మాడుగులలో పెదబాబు, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లిల్లో నాయకులు వైఎస్‌కు నివాళులర్పించారు. పాయకరావుపేటలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, ఎంపీపీ అల్లాడ శివ, జెడ్పీటీసీ చిక్కాల రామారావు, నాయకుడు ధనిశెట్టి బాబూరావు తదితరులు మహానేత వైఎస్‌కు ఘన నివాళులర్పించారు. నక్కపల్లిలో సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు మణిరాజు తదితరులు వైఎస్‌కు అంజలి ఘటించారు. నక్కపల్లిలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఎస్.రాయవరంలో బొలిశెట్టి గోవిందు, కొణతాల శ్రీనులు రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. నర్సీపట్నంలో సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ నేతృత్వంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. యలమంచిలి నియోజకవర్గంలో సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ వర్థంతి కార్యక్రమాలు జరిగాయి.



పట్టణంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంచారు. పీకేపల్లి, పురుషోత్తపురంలలో అన్నసంతర్పణ, ఆక్సాయిపేటలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. పాడేరులో ఎంపీపీ వర్థన ముత్యాలమ్మ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహాలకు అంజలి ఘటించారు. ఏరియా ఆస్పత్రిలో రోగులకు పాలు, రొట్టెలు పంచారు. మాజీ మంత్రి పి.బాలరాజు ఇంటివద్ద కాంగ్రెస్ నాయకులు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల, కొయ్యూరు మండలాల్లోనూ పార్టీ శ్రేణులు వైఎస్‌కు ఘనంగా అంజలి ఘటించారు. అరకులోయలో శెట్టి అప్పాలు, సమర్థి రఘునాథ్, కూన రమేష్‌ల ఆధ్వర్యంలో వైఎస్ కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. అనంతగిరిలో శెట్టి ఆనంద్, డుంబ్రిగుడలో జెడ్పీటీసీ బుజ్జమ్మ నేతృత్వంలో వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top