ట్రాఫిక్ నియంత్రణకు ఇదీ ప్రణాళిక


 రాజమండ్రి క్రైం,

 పుష్కరాల సందర్భంగా మూడంచెల విధానంలో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టినట్టు పుష్కరాల ప్రత్యేక అధికారి కె. ధనుంజయరెడ్డి , రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ ఎస్.హరికృష్ణ తెలిపారు. ఆదివారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో వారు విలేకరులకు ఈ సంగతి తెలిపారు. పుష్కరాలకు వచ్చే వాహనాలు నిలిపేందుకు 140 పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేశామన్నారు.

 

 విశాఖ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, కార్లను లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, చౌడేశ్వర నగర్ వద్ద పార్కింగ్ చేయాలి. కాంట్రాక్టు క్యారియర్లను అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని హుందయ్ షోరూమ్ వద్ద గల స్థలంలో ను, ఆటోనగర్, దివాన్ చెరువు వద్ద జేసి పేపర్ మిల్లు ఎదురుగా గల స్థలంలో పార్క్ చేయాలి.

 

 కార్లు, జీపులను లాలా చెరువు వద్ద ఉన్న రెడ్డి సైటు, రినోల్ట్ సర్వీసు సెంటర్ పక్కన గల ఖాళీ స్థలంలో, జేఎన్. రోడ్డు వద్ద గల చెరుకూరి కన్వెన్షన్‌హాల్ స్థలం, మోరంపూడి వద్ద గల మహాలక్ష్మి మార్కెట్ స్థలంలో పార్క్ చేసుకోవచ్చు. నగరంలో లాలా చెరువు, జి.ఎన్.టి. రోడ్డు , ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్, లాలా చెరువు నుంచి క్వారీ మార్కెట్ రూట్లో గోవింద క్షేత్రం పక్కన గల స్థలంలో, శశి టెక్నో స్కూల్ వద్ద గల స్థలంలో నిలుపుకోవచ్చని తెలిపారు. ఏవీ అప్పారావు రోడ్డు లోని గెయిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో, గెయిల్ ఆఫీసు పక్కన గల స్థలంలో, మురళీ మేన్షన్ వద్ద గల ఖాళీ జాగాలో, శెట్టిబలిజ రామాలయం వద్ద గల స్థలంలో పార్కింగ్ చేసుకోవచ్చన్నారు.  

 

 రావులపాలెం నుంచి వచ్చే వాహనాలు

 ఆర్.టి.సి బస్సులకు మినీవ్యాన్స్, లారీ సప్లై ఆఫీసు వద్ద, ప్రైవేటు బస్సులు, కాంట్రాక్టు క్యారేజీ వాహనాలకు వేమగిరి సదరన్ డ్రగ్స్ పక్కన గల ఖాళీ స్థలంలో, రత్న ప్లాస్టిక్స్ పక్కన గల చెరుకూరి ఖాళీ స్థలంలో, వెలుగుబంటి అచ్యుత రామారావు ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవచ్చని తెలిపారు. కార్లు జీపులను మోరంపూడి మార్బుల్ ఇండియా పక్కన గల స్థలంలో, వీవీ వినాయక్ ఖాళీ స్థలంలో, సిద్ధార్థ డైరీ, చెరుకూరి స్టోరేజి సైట్ పడాల సత్యనారాయణ సైట్‌లో పార్కింగ్ చేసుకోవచ్చని తెలిపారు.

 

 ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వచ్చే వాహనాలు

 కార్లు జీపులకు అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఖాళీ స్థలం, షిరిడి సాయి నగర్,  దవళేశ్వరం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ లో పార్కింగ్ ఏరియా కేటాయించారు.

 కోరుకొండ, సీతానగరం, విజయవాడ నుంచి గామన్ బ్రిడ్జి మీదుగా వచ్చే వాహనాలు :

 ఆర్టీసీ బస్సులకు లూథర్ గిరి, క్వారీ వద్ద శివాలయం, గామన్ బ్రిడ్జి వద్ద గల ఆర్.ఎస్.ఆర్. ఖాళీ స్థలంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు బస్సులు, కాంట్రాక్టు క్యారేజీ వాహనాలకు శానిటోరియం వద్ద డెంటల్ కాలేజీ, శానిటోరియం, కాతేరు వద్ద గల తిరుమల స్కూల్, కొంతమూరు చౌదరి సైట్ లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. కార్లు, జీపుల కోసం లూథర్ గిరి, మార్కెట్ యార్డు, మున్సిపల్ కాలనీ గ్రౌండ్స్, క్వారీ శివాలయం వెనుక, కొంతమూరు ఈఏఆర్ ఎయిడెడ్ హై స్కూల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

 నిత్యావసర వస్తువులతో వచ్చే వాహనాలను రాత్రి 9గంటలనుంచి 12 గంటల వరకూ అనుమతిస్తారని, వీటిని హైవేపై నక్కల బాబూరావు (వేమగిరి) ఖాళీ స్థలంలో ఆపాలని వివరించారు.

 

 వన్‌వేలు... డైవర్షన్లు

 17 వన్‌వే రోడ్లు..  నగరంలో 17 రోడ్లను వన్‌వే చేశామని తెలిపారు. రాజమండ్రిని 9 జోన్లు, 18 సెక్టార్లుగా విభజించి బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. వాహనాలు చెడిపోయి ఆగిపోయిన సందర్భాల్లో వెంటన తొలగించేందుకు క్రేన్లు, టాక్ అండ్ టౌ వాహనాలు ఉంచుతున్నామన్నారు. నగరంలో ట్రాఫిక్ పర్యవేక్షణకు 31 మోటారు పెట్రోలింగ్ టీమ్‌లు, 6 హైవే మొబైల్ వాహనాలు ఏర్పాటు చేశామన్నారు.

 ట్రాఫిక్ మళ్లింపులు

  విశాఖపట్నం నుంచి విజయవాడ ైవె పు వెళ్లే భారీ, ఇతర వాహనాలను దివాన్ చెరువు వద్ద గామన్ బ్రిడ్జి మీదుగా కొవ్వూరు పైపు మళ్లిస్తామన్నారు.

  చెన్నై , గుంటూరు, విజయవాడ వైపునుంచి విశాఖ వైపు వెళ్లే భారీ, ఇతర వాహనాలను కొవ్వూరు నుంచి గామన్ బ్రిడ్జి మీదుగా దారి మళ్ళించి దివాన్ చెరువు నుంచి విశాఖ పైపు పంపుతామన్నారు.  

  రావులపాలెం నుంచి కాకినాడ, విశాఖ పైపు వెళ్లే ఇతర వాహనాలను జొన్నాడ వద్ద దారి మళ్లించి, మండపేట, రామచంద్రపురం మీదుగా కాకినాడ మళ్లిస్తారన్నారు.

  హైదరాబాద్, ఖమ్మం, అశ్వారావు పేట మీదుగా విశాఖ వెళ్లే వాహనాలను కొవ్వూరు నుంచి గామన్ బ్రిడ్జి నుంచి విశాఖ వైపు మళ్లిస్తారన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top