బాణసంచా విక్రయాల్లో జాగ్రత్తలు అవసరం

బాణసంచా విక్రయాల్లో జాగ్రత్తలు అవసరం - Sakshi


గుంటూరు ఈస్ట్

 దీపావళి పండుగకు బాణ సంచా నిల్వలు, దుకాణాల ఏర్పాటు, అమ్మకంలో తగు జాగ్రత్తలు పాటించాలని  కలెక్టర్ కాంతిలాల్ దండే ఒక ప్రకటనలో ఆదేశించారు. హోల్‌సేల్, రిటైల్ బాణ సంచా వర్తకుల కోసం  ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశాల్లోనే వ్యాపారం చేసుకునేలా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని  ఆదేశించినట్టు పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్ సిబ్బందితో టీములుగా ఏర్పడి విసృ్తత తనిఖీలు చేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు.



 నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు

 గుంటూరు క్రైం: జిల్లాలో ఎక్కడైనా దీపావళి టపాసులు  అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం ఉంటే వెంటనే ప్రజలు సమీప పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాలని రూరల్ జిల్లా క్రైం ఏఎస్పీ టి.శోభామంజరి కోరారు. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు నిల్వ చేయడం, అనుమతులు ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా నేరమని చెప్పారు.



హోల్ సేల్ విక్రయదారులు  దుకాణాల వద్ద తప్పనిసరిగా అగ్ని మాపక పరికరాలతో పాటు ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. పోలీసుల అక్రమ వ్యాపారులతో కుమ్మక్కైనట్లు సమాచారం ఉంటే డయల్ 100కు తెలియజేయాలని కోరారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినట్లు తేలినా కఠినంగా వ్యవహరిప్తామన్నారు.  పిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాటన్ వస్త్రాలు ధరించి, ఇంటి బయట తగు జాగ్రత్తలతో బాణసంచా కాల్చాలని సూచించారు.

 

 తాత్కాలిక రిటైల్ వ్యాపారులకు సూచనలు ఇవీ..


     దరఖాస్తులను ఈనెల 20 సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారికి అందజేయాలి. దరఖాస్తుతోపాటు రెండు పాసుపోర్టు సైజు ఫొటోలు, నిర్ణీత రుసుము చలానా రూపంలో జతచేయాలి. మున్సిపల్, అగ్నిమాపక శాఖ అధికారులు కేటాయించిన స్థలంలోనే స్టాల్స్ ఏర్పాటు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ లెసైన్సులు రద్దు చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top