ప్రతిభకు ప్రోత్సాహం

ప్రతిభకు ప్రోత్సాహం - Sakshi


మహిళా పరిశోధకులకు  ప్రోత్సాహకాలు ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్,

బీటెక్ మహిళలకు ఫెలోషిప్‌లు మూడు విభాగాల్లో అందజేత


 

 ఏయూక్యాంపస్: పరిశోధన జరపాలంటే సృజనాత్మకత కావాలి. ఆలోచనలకు పదును పెట్టాలి. ఆవిష్కరణలకు జీవం పోయాలి. మనం ఎంపిక చేసుకున్న రంగంలో మార్గదర్శకత్వం అందించే వ్యక్తులు కావాలి. ఆశయాలు కార్యరూపంలో చూపి ఉన్నత పరిశోధన అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాన్ని ప్రత్యేకంగా మహిళలకు అందిస్తోంది డీఎస్‌టీ. పరిశోధనతో పాటు పీహెచ్‌డీని కూడా పొందే అపురూప అవకాశం ఉంది. భారత శాస్త్ర, సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో మహిళా పరిశోధకులకు అందించే ప్రోత్సాహకాలపై సమగ్ర సమాచారం మీ కోసం...



ఉన్నత విద్యను పూర్తిచేసిన మహిళలల్లో పరిశోధనాసక్తి కలిగిన వారు కోకొల్లలు. సాధారణ ఉద్యోగం చేయడంకంటే పరిశోధనపై ఆసక్తి కనబరిచేవారు ఎందరో ఉంటున్నారు. వీరికి ఎదురయ్యే ఆర్ధిక అవరోధాలను తొలగించి పరిశోధనా రంగంలో పురుషులతో సమానంగా తీర్చిదిద్దే బృహత్తర ఆలోచనతో ఏర్పాటుచేసినదే ఈ ‘వుమెన్‌సైంటిస్ట్ స్కీం’. సైన్స్, ఇంజినీరింగ్ రంగాల్లో ఉన్నత విద్యను పూర్తిచేసిన 28 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగినవారు దీనికి అర్హులు. పరిశోధనాసక్తి కలిగిఉన్న వారు ప్రాథమిక శాస్త్రాలు, అనువర్తిత శాస్త్రాలలో పరిశోధనాసక్తి కలిగినవారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.



 పరిశోధన చేసే వారికి ఉపకారవేతనం, పరిశోధనకు అవసరమైన నిధుల మంజూరు కూడా డీఎస్‌టీ చేస్తుంది. జాతీయ,రాష్ట్ర స్థాయి వర్సిటీలు, పరిశోధనా సంస్థల సహకారంతో పనిచేసే వారికి ఈ స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. స్వచ్ఛంద సంస్థలకు, సామాజిక సమస్యలపై పనిచేసే వారికి నాన్ ఇనిస్టిట్యూషనల్ విభాగం కింద నిధులు అందిస్తున్నారు. మూడు విభాగాలుగా పరిశోధనలకు  స్కాలర్‌షిప్‌లు అందిస్తారు.

     

{పాథమిక, అనువర్తిత శాస్త్రాల్లో పరిశోధనలకు(వుమెన్ సైంటిస్ట్ స్కీం-ఏ) సామాజిక సంబంధిత అంశాల్లో శాస్త్ర, సాంకేతిక పరిశోధనకు(వుమెన్ సైంటిస్ట్ స్కీం-బి) స్వయం ఉపాధి పొందే వారికి ఇంటెర్నషిప్(వుమెన్ సైంటిస్ట్ స్కీం-సీ) సైన్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో భాగంగా ఫిజికల్‌సైన్స్, కెమికల్ సైన్స్, మేథమెటికల్ సైన్స్, లైఫ్‌సైన్స్, ఎర్త్ సైన్స్, ఎట్మాస్ఫియర్‌సైన్స్, ఇంజినీరింగ్ సైన్స్ విభాగాల్లో తమ ప్రాజెక్టును నిర్వహించే వీలుంది. విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల అనుసంధానంతో తమ పరిశోధనా ప్రాజెక్టును డీఎస్‌టీకి పంపాల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారిలో ఎమ్మెస్సీ విద్యార్హత వారికి గరిష్టంగా రూ.20 లక్షలు, పీహెచ్‌డీ వారికి రూ.23 లక్షలు అందిస్తారు. మూడు సంవత్సరాల కాల పరిమితిలో తమ ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనిలో విద్యార్థి స్కాలర్‌షిప్, పరికారాలు కొనుగోలు ఖర్చులు, రవాణా, వస్తువులు పరిశోధనకు లోబడి అవసరమైన ఇతర ఖర్చులకు వెచ్చించే అవకాశం ఉంటుంది.



ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్హత కలిగిన వారు 35 సంవత్సరాల లోపు వయోపరిమితి కలిగి ఉండాలి. వీరికి ప్రతి నెలా ఫెలోషిప్‌గా అందిస్తారు. ఎంటెక్, ఎం.డి, ఎం.ఎస్, డి.ఎం, ఎం.టిహెచ్ తదితర విద్యార్హత కలిగిన వారికి సైతం స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులకు ఐదేళ్ల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.



దరఖాస్తు చేయడానికి నిర్ధిష్ట గడువు లేదు. ఏడాది పొడవునా విద్యార్థినులు తమ దరఖాస్తులను డీఎస్‌టీకి అందజేసే అవకాశం ఉంది. తాము పరిశోధన చేయదలచిన విభాగం, సంబంధిత అంశాలతో కూడిన దరఖాస్తు అందించాలి. మరిన్ని వివరాలకు ఠీఠీఠీ.ఛీట్ట.జౌఠి.జీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో సైంటిఫిక్ ప్రోగ్రాంస్ విభాగంలో వుమెన్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో పూర్తి వివరాలు లభిస్తాయి.

 

సమాజ ఉపయుక్త అంశాలు ఎంపిక చేసుకోవాలి



పరిశోధన ఆసక్తితో పాటు సమాజానికి ఉపయుక్తంగా ఉండే అంశాలను ఎంపికచేసుకోవడం మంచింది. ఇంజినీరింగ్ కంటే సైన్స్ విభాగాల్లో దీనికి పోటీ అధికంగా ఉంటుంది. పరిశోధన అంశం ఎంపికచేసుకోవడం చాలా ప్రధానం. పరిశోధన చేసే విధానం, నిపుణులకు వివరించే సామర్థ్యం ఆధారంగా ప్రాజెక్టు వస్తుంది. దేశ వ్యాస్తంగా వచ్చే నిపుణులు ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. ఈ వుమెన్‌సైంటిస్ట్ ప్రోగ్రాంకు గతంలో ఎక్కువ మందికి అవగాహన ఉండేది కాదు. పలు సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళల్లో చైతన్యం తీసుకువస్తూ, పరిశోధనా దిశగా ప్రోత్సహిస్తున్నారు. విశ్వవిద్యాలయాల అనుసంధానంతో పరిశోధన చేస్తూ, అదే అంశంపై పీహెచ్‌డీ కూడా పొందే వీలుంది. మహిళలు పరిశోధనా రంగంలో ముందడుగు వేయడానికి ఈ పథకం ఉపకరిస్తుంది. వీలయినంత ఎక్కువమంది మహిళలు ఈ అవకాశం వినియోగించుకోవాలి. -ఆచార్య కె.రాజరాజేశ్వరి, డెరైక్టర్, వీతం విద్యాసంస్థలు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top