ప్రజలకు అండదండగా ఉండాలి


  •      వారిలో విశ్వాసం కలిగించాలి

  •      మనోధైర్యం నింపాలి

  •      పోలీస్ అధికారుల వర్క్‌షాప్‌లో డీఐజీ కాంతారావు

  • కేయూ క్యాంపస్ : ‘పోలీసులు ప్రజలకు అం డగా నిలుస్తారని, వారిలో విశ్వాసాన్ని కలిగిం చాలి.. మనోధైర్యం నింపాలి.. ఆ విధంగా మన సేవలు ఉం డాలి...’అని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం. కాంతారావు ఆ శాఖ అధికారులకు సూచిం చారు. అర్బన్ పోలీస్ విభాగం కమిషనరేట్‌గా రూపాంతరం చెందనున్న నేపథ్యంలో పోలీసు ల పనితీరు, ప్రవర్తనలో మార్పు రావాల్సి ఉంటుందని తెలిపారు.



    రాబోయే రోజుల్లో ప్రజల కు మరింత చేరువ కావాల్సి ఉంటుందని, అప్పుడే పోలీసు శాఖ ప్రతిష్ఠ ఇనుమడిస్తుం దని పేర్కొన్నారు. ఈ మేరకే వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాకతీయ యూనివర్సి టీ సెనేట్ హాలులో గురువారం ఏర్పాటు చేసి న ఈ వర్క్‌షాపును ఆయన ప్రారంభించి.. ప్రసంగించారు. సమాజంలో పోలీసుల కదలికలను, నడవడికను ప్రతీ వ్యక్తి గమనిస్తుంటాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.



    ప్రజల భాగస్వామ్యంతోనే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాల్సిన అవరం ఉందని పేర్కొన్నారు. వివిధ సమస్యలతో పోలీస్‌స్టేషన్లకు వచ్చే మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వారి కి పోలీస్‌శాఖ అండగా ఉంటుందనే విశ్వాసం కలిగించేలా ప్రవర్తన ఉండాలని చెప్పారు.

     

    అప్పుడే.. ప్రజలు ఆశించిన వ్యవస్థ : అర్బన్ ఎస్పీ



     పోలీసులపై ప్రజలు ఎప్పుడూ భారీ అంచనాలతో ఉంటారని, వారి ఆలోచనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. అప్పుడే వారు ఆశించిన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయగలుగుతామని స్పష్టం చేశారు.  

     

    వ్యామోహంతోనే ఒత్తిళ్లు : డాక్టర్ పట్టాభిరామ్

     

    సమాజంలో ప్రతీ వ్యక్తికి ఒత్తిళ్లు అనేవి సహజమని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ పట్టాభిరామ్ తెలిపారు. వ్యామోహాలు తగ్గించుకుంటే ఒత్తిళ్లకు దూరంగా ఉండవచ్చని చెప్పారు. ఈ వర్క్‌షాపులో పోలీసు అధికారులకు ‘విధులు.. ఒత్తిళ్లు.. పరివర్తన’ అనే అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. పోలీసు వ్యవస్థ సవాళ్లతో కూడుకున్నదని, వాటిని కఠినతరంగా భావించవద్దని, నిర్మలంగా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకుని అడుగు ముందుకేస్తే విజయం సాధించవచ్చని, ఒత్తిళ్లను అధిగమించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో అర్బన్ ఎస్పీ యాదయ్య, హన్మకొండ, కాజీపేట, మామునూరు, క్రైం, ట్రాఫిక్, ఏఆర్ డీఎస్పీలు దక్షిణమూర్తి, రాజిరెడ్డి, సురేశ్‌కుమార్, రామమహేంద్రనాయక్, ప్రభాకర్, రమేష్, ఇన్‌స్పెక్టర్లు,సబ్‌ఇన్‌స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top