తిరుపతి ఎంపీపీపై అనర్హతవేటు


  •      మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులపై కూడా..

  •      విప్‌ను  ధిక్కరించినందుకే!

  •      జెడ్పీ మీటింగ్‌కు రానీయకుండా అడ్డుకునేందుకే జెడ్పీకి సమాచారం

  • చిత్తూరు(టౌన్): తిరుపతి మండలాధ్యక్షునిపై అనర్హ త వేటు పడింది. విప్‌ను ధిక్కరించిన నేరానికి ఎంపీపీతో పాటు మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులపై అనర్హత వేటు వేసినట్టు ఆ మండల ఎన్నికల ప్రిసైండిం గ్ అధికారి, ఎంపీడీవో సుశీలాదేవి జిల్లా పరిషత్‌కు సమాచారాన్ని అందజేశారు. జిల్లాలోని అన్ని మం డల పరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లో భాగంగా తిరుప తి రూరల్ మండలంలో మొత్తం 40 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.



    వాటిలో 21 ఎంపీటీసీ స్థా నాలను అధికారపార్టీ దక్కించుకోగా, 14 స్థానాలను వైఎస్‌ఆర్ సీపీ, ఒకదాన్ని సీపీఎం, నాలుగింటిని ఇం డిపెండెంట్లు గెలుచుకున్నారు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులతో పాటు ఇండిపెండెంట్ల మద్దతుతో టీడీపీ కి చెందిన మునికృష్ణయ్య ఎంపీపీగా ఎన్నికయ్యారు.  అతనికి టీడీపీకి చెందిన ఉష, సుధాకర్‌రెడ్డి మద్దతు లభించింది. దీంతో మునికృష్ణయ్య ఎంపీపీగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమయ్యింది. అయితే దీ న్ని అవమానంగా భావించిన అధికారపార్టీ నాయకులు తమ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులుగా తయారైన వారిపై చర్యలు తీసుకుని వారిని తొలగించేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు.



    ఈ నేపథ్యం లో తమ పార్టీ సభ్యుల ద్వారా విప్ జారీ చేయించా రు. ఆ తర్వాత పైస్థాయిలో నుంచి జిల్లా, మండల ప్రిసైడింగ్ అధికారులపై ఒత్తిళ్లు తెప్పించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించడంతో ఎంపీపీగా ఎ న్నికైన మునికృష్ణయ్య, అతనికి మద్దతిచ్చిన ఎంపీటీ సీ సభ్యులు ఉష, సుధాకర్‌రెడ్డిపై అనర్హత వేటు ప డింది. వారిని ఎంపీటీసీ సభ్యత్వాల నుంచి కూడా తొలగిస్తున్నట్టు ఈ నెల 28న ఆదేశాలు జారీ చేసిన ట్టు జెడ్పీకి అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. వి ప్ ధిక్కరించినట్టు తమకు అందిన ఫిర్యాదు మేరకు వారిపై అనర్హత వేటువేస్తూ చర్యలు తీసుకున్నట్టు తిరుపతి రూరల్ మండల ప్రిసైండింగ్ అధికారి, ఎంపీడీవో సుశీలాదేవి ఫోన్‌లో  వివరించారు. వీరిని ఎంపీటీసీ సభ్యత్వాల నుంచి కూడా తొలగిస్తున్నట్టు  ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

     

    జెడ్పీ మీటింగ్‌కు రాకుండా అడ్డుకునేందుకే..

     

    ఆదివారం జరగనున్న జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్యసమావేశంలో తిరుపతి ఎంపీపీ హాజరు కాకుండా చూడాలని అధికారపార్టీ నాయకులు తీవ్రంగా  ప్ర యత్నించి సఫలమయ్యారని తెలిసింది. పార్టీ అధికారంలో వుండికూడా అవకాశమున్న ఎంపీపీని చేజిక్కించుకోలేకపోయామనే ఆవేదన చంద్రగిరి నియోజకవర్గ అధికారపార్టీ నేతలను ఎంతో కలవరపెట్టింది. అందులో భాగంగానే వీలైనంత త్వరగా అతనిపై వేటుపడేటట్లు చేసి జెడ్పీ మీటింగ్‌హాలులోకి అడుగుపెట్టకుండా చేయాలని భీష్మించుకుని కూర్చున్నట్టు తెలిసింది. దీంతో విప్ జారీచేయడం, వెనువెంటనే జిల్లా అధికారులపై ఒత్తిడితెచ్చి అనర్హత వేటుపడేటట్లు చర్యలు తీసుకుని తద్వారా ప్రతీకారం తీర్చుకున్నారని తెలిసింది. అయితే దీనివెనక  మాజీమంత్రి  గల్లా అరుణకుమారి హస్తమున్నట్లు స్పష్టమవుతోంది.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top