తిరుమలలో పోలీసుల హడావుడి


  • నాలుగు మాడ వీధుల్లో పోలీసుల దిగ్బంధనం

  •  అవసరం లేనిచోట్ల బ్యారికేడ్లు..

  •  చేతులెత్తేసిన టీటీడీ ఉన్నతాధికారులు

  • సాక్షి,తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎన్నడూ లేనివిధంగా పోలీసుల హడావుడి పెరిగిపోయింది. వారి ధాటికి టీటీడీ ఉన్నతాధికారులు సైతం వెనక్కు వెళ్లిపోయారు. అవసరం లేనిచోట్ల బ్యారికేడ్లు నిర్మించి అడుగడుగునా భక్తులను కట్టడిచేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సాధారణంగా తిరుమల బ్రహ్మోత్సవాలు టీటీడీ ఉన్నతాధికారుల చే తుల మీదుగానే జరగాల్సి ఉంది. ఈసారి మా త్రం అందుకు భిన్నంగా పోలీసుల చేతుల్లోకి వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్న డూ లేనివిధంగా పోలీసులు హడావుడి పెరిగి పోయింది.



    ఆలయం వద్ద అదనపు బ్యారికేడ్ల నిర్మించడం నుంచి వాహన సేవల ముందు గుంపులుగుంపులుగా పోలీసు దుస్తుల్లో ఉన్న అధికారుల సంఖ్య పెరిగిపోయింది. వాహన సేవ ముందు పోలీసు దుస్తుల్లో కనిపించే అధికారులు, సిబ్బంది ఉండకూడదనేది సంప్రదాయ. గత ఏడాది సంప్రదాయంగా ఉండే వే ద పాఠశాల విద్యార్థులతో వేదహారం ఏర్పాటు చేశారు. వాహన సేవ ముందు పోలీసులు లేకుండా వేద విద్యార్థులు అధికంగా ఉండడం వల్ల భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి మాత్రం వేద విద్యార్థులను కూడా పక్కకు నెట్టి వాహనం ముందు పోలీసులే దర్శనమిచ్చారు.



    అలాగే, గ్యాలరీలు ఖాళీగా ఉన్నా భక్తులను మాత్రం అనుమతించకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. భక్తులు నడిచేందుకు వీలులేకుండానే రాంభగీచా వెలుపల నుంచి ఆలయ నాలుగుమాడ వీధుల్లో లెక్కకు మించి బ్యారికేడ్లు నిర్మించారు. రాంభగీచా అతిథిగృహాల్లో బస చేసేవారికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. గతంలో ఒక్క గరుడ సేవ రోజు మాత్రమే కట్టడి చేసేవారు. ఇందుకు భిన్నంగా ఈ ఏడాది తొలిరోజు నుంచే కట్టడి చేయటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

     

    వాహన సేవల్లో పోలీసుల జోక్యంతో జేఈవో దూరం



    టీటీడీ నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో గతానికి భిన్నంగా వాహన సేవల్లోనూ పోలీసుల హడావుడి పెరిగిపోవడంతో తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుతోపాటు టీటీడీలోని పలువిభాగాల ఉన్నతాధికారులు తీవ్ర మనస్థాపానికి గురైనట్టు ప్రచారం సాగుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం కాకుండా పోలీసుల కనుసన్నల్లో బ్రహ్మోత్సవ కార్యక్రమం సాగుతుండడంతో జేఈవో కొంత దూరం పాటిస్తున్నట్టు సమాచారం. వాహన సేవల్లో కూడా ఆయన నామమాత్రంగానే పాల్గొంటున్నారని ఇతర అధికారులు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top