ఈత.. విషాదం


వారు ముగ్గురు స్నేహితులు.. ఎప్పుడూ కలిసి తిరి గే వారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా పాఠశాలకు సెల వు ఇవ్వడంతో చెరువులో స్నానానికి వెళ్లారు. దురదృష్టవశాత్తు చెరువులో ఉన్న గుంతలో పడి నీట మునిగిపోయారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కన్నబిడ్డలు విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు వారిని చూసి గుండెలవిసేలా రోది స్తున్నారు. ‘ఇక మాకెవరు దిక్కు బిడ్డా.. ఎవల కో సం బతకాలి’ అని వారు రోదిస్తున్న తీరు అందరి నీ కలిచివేస్తోంది. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ము లున్నారు. ఈ హృదయ విదారక సంఘటన హుజూరాబాద్ మండలం కనుకులగిద్దలో శుక్రవారం జరిగింది. చింతకుంటలో జరిగిన మరో  ప్రమాదంలో ఓ ఆరో తరగతి విద్యార్థి నీటి గుంతలో పడి చనిపోయాడు.

 

 హుజూరాబాద్ /హుజూరాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : హుజూరాబాద్ మండలం కనుకులగిద్దకు చెందిన అల్లి రమేశ్ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రమేశ్, పుష్పలత దంపతులకు రోహి త్ (12), ప్రణీత్ (10) ఇద్దరే సంతానం. పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో రోహిత్ ఆరో తరగతి చదువుతుండగా, ప్రణీత్ నాలుగో తరగతి చదువుతున్నా డు. ఇదే గ్రామానికి చెందిన దాసరి చంద్రారెడ్డి, సరోజన దంపతుల ఒక్కగానొక్క కుమారుడు విఘ్నేశ్వర్‌రెడ్డి(గణేశ్) (15) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వీరు ముగ్గురితోపాటు మరో ఇద్దరు శివాజీ, వినయ్ శుక్రవారం ఉదయం గిద్దె చెరువు వద్దకు స్నానానికి వెళ్లారు.

 

 రోహి త్, ప్రణీత్, గణేశ్ కలిసి చెరువులో దిగగా శివాజీ, వినయ్ ఒడ్డుపైనే కూర్చున్నారు. చెరువులో గుంత ఉన్న విషయాన్ని పసిగట్టలేక ముగ్గురు చిన్నారులు  అందు లో మునిగారు. తాము మునిగిపోతున్నామని కేకలు వేయడంతో ఒడ్డుపై కూర్చున్న ఇద్దరు చిన్నారులు హు టాహుటిన గ్రామంలోకి పరుగెత్తుకొచ్చారు. ఈ విషయాన్ని అక్కడున్న వాళ్లకు చెప్పడంతో వారు చెరువు వద్దకు వెళ్లేసరికి ప్రణీత్, గణేశ్ నీటిలో పూర్తిగా మునిగి పోయారు.

 

 రోహిత్ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా బయటకు తీశారు. హుజూరాబాద్‌లోని సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో అత డు కూడా చనిపోయాడు. ప్రణీత్, గణేశ్‌ల ఆచూకీ కో సం చెరువులో గాలించగా వారి మృతదేహాలు కనిపిం చాయి. సంఘటన స్థలానికి  హుజూరాబాద్ సీఐ శ్రీని వాస్, ఎస్సై జగదీశ్ వచ్చి చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఒకే గ్రామానికి చెం దిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

 తల్లిదండ్రులకు కడుపు కోతే...

 అల్లి రమేశ్, పుష్పలత దంపతులు తమ కొడుకులు రోహిత్, ప్రణీత్‌లను అల్లారుముద్దుగా పెంచుకుంటూ  కష్టపడి హుజూరాబాద్‌లో చదివిస్తున్నారు.  కొడుకుల ను చూసుకుంటూ సంతోషంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు కడుపు కోతే మిగిలింది.

 

 ఒక్కగానొక్క కొడుకు.

 దాసరి చంద్రారెడ్డి, సరోజనలకు ఏకైక సంతానం గణే శ్. వీరిది వ్యవసాయ కుటుంబం. పెళ్లయిన తర్వాత ఆలస్యంగా జన్మించిన గణేశ్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.  కొడుకు కళ్లముందే ఉండాలని గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. చివరకు అతడు ఇలా చెరువులో తుది శ్వాస విడవడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

 సెలవు లేకున్నా బతికేవారు..

 గుడ్‌ఫ్రైడే సందర్భంగా పాఠశాలకు సెలవు ఇవ్వడం తోనే ఈ ఘటన జరిగిందని, సెలవు లేకున్నా పిల్లలు బతికేవారని వారు తల్లిదండ్రులు రోదిస్తున్నారు.

 

 చింతకుంటలో ఆరో తరగతి విద్యార్థి..

 కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ :  బోయినపల్లి మండ లం విలాసాగర్‌కు చెందిన సల్లా లచ్చయ్య, లత దంపతుల చిన్న కుమారుడు సాయికుమార్(12)  ఓ నీటి గుంతలో పడి చనిపోయాడు. వీరు  చింత కుంట శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. సా యికుమార్ ధన్గర్‌వాడి పాఠశాలలో చదువుతు న్నాడు. శుక్రవారం సోదరుడు సతీష్, స్నేహితులు నవీన్, కుమార్‌తో కలిసి ఇంటి సమీపంలో ఉన్న లోతైన గుంతకు ఈత కొట్టడానికి వెళ్లాడు. మొద ట సాయికుమార్, కుమార్ లోపలికి దిగారు.  దిగి న వెంటనే మట్టిజారి మునిగిపోయారు. గమనిం చిన సతీష్  పరుగెత్తుకెళ్లి సమీపంలో ఉన్న ఒడిశా కార్మికులకు చెప్పగా వారు కుమార్‌ను కాపాడారు. సాయికుమార్ అప్పటికే మునిగిపోయాడు. కాసే పటికి అతడి మృతదేహం కనిపించింది. కొడుకు మృతదేహాన్నిచూసి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top