హత్య కేసులో ముగ్గురి అరెస్టు


మంగళగిరి రూరల్: హత్య కేసులో ముగ్గురు నిందితులను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరుపంచాయతీ పరిధి గుంటూరు చానల్‌లో గత నెల 18న గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతు డు పట్టణానికి చెందిన షేక్ ఖైరుల్లా అలి యాస్ కరిముల్లా (28)గా గుర్తించారు. విచారణలో హత్యగా తేలడమే కాకుండా ఈ కేసులో హతుని భార్య గౌసియా, ఆమె ప్రియుడు దామర్ల సాయి, సాయి స్నేహితుడు గుళ్లపల్లి ప్రవీణ్‌కుమార్‌లను అరెస్టుచేశారు. శనివారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ హరికృష్ణ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 18న గుంటూరు చానల్‌లో కుళ్లిపోయిన స్థితిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం బయటపడింది. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించ గా.. గొంతువద్ద గాయాలు కనిపించడం తో అనుమానాస్పదమృతిగా కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 ఈక్రమంలో పట్టణానికి చెందిన జాన్‌సైదా, తన మరదలు గౌసియాతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన తమ్ముడు ఖైరుల్లా కనిపించడం లేదని తెలిపారు. పోలీసులు గుంటూరు చానల్‌లో దొరికిన యువకుడి మృతదేహం ఫొటోలు, దుస్తులు చూపించగా అవి తన తమ్ముడివిగా గుర్తించాడు. తమది లక్ష్మీనరసింహకాలనీ అని, తన తమ్ముడి భార్య గౌసియా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఖైరుల్లాను హత్యచేసి ఉంటుందని అనుమా నం వ్యక్తం చేశాడు. ఆ దిశగా విచారణ జరపగా.. ఖైరుల్లా తన ఇంట్లో వ్యభిచార వృత్తి నిర్వహించేవాడని తేలింది. అది నచ్చక గౌసియా భర్తతో గొడవ పడేది. భర్త వ్యవహారంతో విసుగుచెందిన గౌసి యా తన ఇంటికి అమ్మాయిల కోసం వచ్చే పట్టణంలోని వడ్లపూడి సెంటర్‌కు చెందిన దామర్ల సాయి అనే యువకుడితో పరిచయం పెంచుకుంది.

 

 వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. ఖైరుల్లాను తుదముట్టిస్తే తామిద్దరం హాయి గా ఉండవచ్చని గౌసియా, సాయిలు భావించారు. సాయి స్నేహితుడు గుళ్లపల్లి ప్రవీణ్‌కుమార్ సాయం తీసుకున్నారు. గత నెల 15వ తేదీ రాత్రి సాయి, ప్రవీణ్‌కుమార్‌లు ఖైరుల్లా ఇంటికి వెళ్లి అమ్మాయి కావాలని అడగడమేకాకుం డా, అయన్ను నమ్మించి మద్యం తాగుదామని తమ వాహనంపై ఎక్కించుకుని గుంటూరు చానల్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ మద్యం తాగి సర్జికల్ బ్లేడ్‌తో ఖైరుల్లా గొంతులో పొడిచి నీళ్లల్లో తొక్కిపెట్టి హత్యచేశారు.

 

 చేతికి ఉన్న వెం డి ఉంగరం తీసుకుపోయారు. సాయి ఇంటికి వెళ్లి తన అన్నయ్యకు చెందిన బ్రాస్‌లెట్, ఐదు బంగారు ఉంగరాలు, గొలుసు తీసుకుని ప్రియురాలు గౌసి యా, ఆమె ఇద్దరి పిల్లలతో పారిపోయి తెనాలిలో నివాసం ఉంటున్నాడు. కొన్ని బంగారు వస్తువులను విక్రయించి గౌసియాకు స్కూటీ కొనుగోలు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు తెనాలిలో వున్నట్లు తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి నిందితులను అరెస్టు చేసి వారి వద్ద సర్జికల్ బ్లేడ్, బ్రాస్‌లెట్, నాలుగు ఉంగరాలు, టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్, స్కూటీ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో రూరల్ ఎస్‌ఐలు అంకమ్మరావు, వై.సత్యనారాయణ, సిబ్బంది మోహనరావు, శాంతకుమార్, పోతురాజు, రాఘవ, శ్రీనివాసరావు విజయ్, ప్రకాష్, సుబ్బారావు తదితరులు వున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top