వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి - Sakshi


వేపాడ(ఎస్‌.కోట) : రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జాకేరు గ్రామానికి చెందిన కొనతల అప్పారావు మంగళవారం మృతి చెందాడు. దీనికి సంబంధించి వల్లంపూడి ఎస్‌ఐ కృష్ణారావు తెలిపిన వివరాలు...జాకేరు గ్రామానికి చెందిన అప్పారావు సోంపురం సమీపంలోని క్వారీ వద్ద టీ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఎప్పటిలాగే దుకాణం మూసివేసి స్వగ్రామం జాకేరుకు టీవీఎస్‌పై వస్తుండగా అదుపుతప్పి రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎస్‌.కోట ఆసుపత్రిలో చికిత్స చేయించి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్క డ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు చెప్పారు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.  



అప్పారావు కళ్లు సజీవం

ప్రమాదంలో గాయాల పాలై చికిత్స పొందుతూ మరణించిన అప్పారావు కళ్లు సజీవంగా వుండాలన్న ఆశయంతో వల్లంపూడి పోలీసులు, గ్రామ ఉపసర్పంచ్‌లు అప్పలనాయుడు కుటుంబీకులకు అవగాహన కల్పించటంతో భార్య లక్ష్మి కళ్లు దానానికి అంగీకరించారు. దీంతో మోషిన్‌ ఐ బ్యాంకు సిబ్బంది కళ్లును  భద్రపరచారు. ఇదిలా ఉండగా మృతుని భార్య లక్ష్మీకి చంద్రన్న బీమా తక్షణ సాయం కింద మంగళవారం రూ.ఐదు వేలు అందజేశారు.  



 విశాఖలో చీపురుపల్లి వాసి మృతి

చీపురుపల్లి: విశాఖపట్టణంలోని రైల్వే న్యూకాలనీ క్వార్టర్లు ప్రాంతంలో చీపురుపల్లి ప్రాంతానికి చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు విశాఖపట్టణంలోని నాల్గవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ హెచ్‌సీ జయశీలన్‌ ఫోన్‌లో ఇక్కడి విలేకరులకు మంగళవారం తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి మృతుడు పని చేసిన మద్యం దుకాణంలో సేకరించిన ఆయన అందించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్టణంలోని జ్ఞానాపురంలో గల ఓ మద్యం దుకాణంలో మృతుడు  కొంత కాలంగా నెలకు రూ.2,500 వేతనానికి పని చేస్తున్నాడు.



 అయితే ఐదారు నెలలు వరకు జీతం కూడా తీసుకోకుండా ఇంటికి వెళ్లినప్పుడే జీతం తీసుకోవడం అలవాటు. అందులో భాగంగానే పదిహేను రోజులు కిందట మృతుడు ఒకేసారి ఐదు నెలలు జీతం తీసుకుని చీపురుపల్లిలో తన ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లినట్లు తెలిపారు. అయితే తిరిగి ఇంతవరకు రాలేదని, తీరా చూస్తే న్యూకాలనీ రైల్వే క్వార్టర్స్‌ పరిధిలో మూడు రోజులు కిందట శవమై కనిపించినట్లు తెలిపారు.



 మృతుడు తనకు ఓ చెవిటి భార్య, కూతురు ఉన్నట్లు చెప్పేవాడని, పేరు నాగరాజుగా చెప్పాడని మద్యం దుకాణం నిర్వాహకులు స్పష్టం చేసినట్లు హెచ్‌సీ తెలిపారు. ఇంతవరకు మృతదేహాన్ని ఖననం చేయలేదని, కుటుంబ సభ్యులు ఎవరైనా గుర్తుపట్టి వస్తే 9441401577, 9440796012 నంబర్లకు సంప్రదించాలని హెచ్‌సీ కోరారు.   మృతుని ఫొటోలను చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌కు కూడా పంపించినట్లు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top