సమయానికి రారు..పనిచేయరు


  •      మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయంలో ముగ్గురే హాజరు

  •      ఇదీ పీఆర్ ఈఈ కార్యాలయ పనితీరు

  • చిత్తూరు(టౌన్): చిత్తూరు పంచాయతీరాజ్ ఈఈ (పాజెక్ట్స్ విభాగం) కార్యాలయ సిబ్బంది పనితీరు విమర్శలకు దారితీసోంది. ఇక్కడి సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు హాజరుకావడం లేదు. గురువారం ఈ కార్యాల యాన్ని ‘సాక్షి’ విజిట్ చేసింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యాలయంపై నిఘా ఉంచింది. 10.30 గంటలకు ముందే ఈఈ అమరనాథరెడ్డి తన చాంబరులో ఉన్నారు. ముగ్గురు అటెండర్లు తమ విధుల్లో కనిపించారు. డీఏవో(డివిజినల్ అకౌం ట్స్ ఆఫీసర్) క్యాబిన్ ఖాళీగా కనిపిం చింది.



    ఎనిమిది సీట్లకు గాను ఆరు సీట్లలో సిబ్బంది కనిపించలేదు. 11.30 గంటలపుడు ఒకరు వచ్చారు. మిగిలిన ఐదుగురు మధ్యాహ్నం వరకు కనిపించలేదు. డీఏవో కూడా కనిపించలేదు. విచారించగా తిరుపతి నుంచి రావాల్సి ఉందని సమాధానమిచ్చారు. సూపరిం టెండెంట్‌తోపాటు ఇద్దరు సెలవులో ఉన్నట్లు తెలిసింది. మిగిలిన ఐదుగురు విధులకు డుమ్మా కొట్టిన విషయం వెలుగుచూసింది. పక్కనే జెడ్పీ సీఈవో, మరోవైపు జెడ్పీ చైర్‌పర్సన్, కాస్త దూరంలో ఎస్‌ఈ (సూపరింటెండెంట్ ఇంజనీర్) కార్యాలయాలు ఉన్నా ఏమాత్రమూ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

     

    బయటి ప్రాంతాల్లో కాపురం..

     

    పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో పనిచేసే పలువురు ఉద్యోగులు, సిబ్బం ది బయటి ప్రాంతాల్లో కాపురముంటూ నిత్యం బస్సుల్లో వచ్చి వెళుతున్నారు. పనిచేసే చోటే కాపురముండాలన్న ప్ర భుత్వ నిబంధనను ఏ ఒక్కరూ పట్టిం చుకోవడం లేదు. తిరుపతి, కార్వేటినగరం, పుత్తూరు, పలమనేరు తదితర ప్రాంతాల నుంచి నిత్యం బసుల్లో ప్ర యాణిస్తూ విధులకు హాజరవుతున్నా రు. తిరుపతి నుంచి వచ్చే వారయితే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్తూరుకు ఏ సమయానికి చేరుకుంటే ఆ సమయం లో విధులకు హాజరవుతున్నారు. కొంద రు ప్యాసింజర్ రైలులో వస్తున్నారు. వీటిలో ప్రయాణించే వారు మధ్యాహ్నం 12 గంటల లోగా ఏ రోజూ చేరుకోలేకపోతున్నారు. దీనిపై అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో రోజు ఇద్దరు ముగ్గురు మాత్రమే కార్యాలయంలో కనిపిస్తున్నారు.

     

    జీతాలు కట్ చేస్తాం

     

    ఈ విషయాన్ని పంచాయతీరాజ్ ఈఈ అమరనాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటికే పలుమార్లు సమయ పాలన పాటిం చాలని ఆదేశించానన్నారు. గురువారం కార్యాలయం బోసిపోయిన విషయాన్ని ఆయన అంగీకరించారు. డీఏవో తిరుప తి నుంచి రావడం వల్ల ఆలస్యమవుతు న్న విషయం వాస్తవమేనన్నారు. ఇకపై ఇదేవిధంగా వ్యవహరిస్తే ఒకటి రెండుసార్లు అటెండెన్స్ రిజిస్టరులో సీఎల్ మా ర్కు చేస్తానని, అప్పటికీ మార్పు రాకపో తే జీతాలు కట్ చేస్తానని పేర్కొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top