మనీయే.. ఉష్ణమానిని

మనీయే.. ఉష్ణమానిని


ఉష్ణోగ్రతను సూచించే అరుదైన నాణేన్ని తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన పుత్సా కృష్ణకామేశ్వర్ సేకరించారు. ఉష్ణోగ్రతను తెలియజేసే సెల్సియస్ స్కేల్‌ను కనుగొన్న ఆండర్స్ సెల్సియస్‌కు నివాళిగా కుక్ ఐల్యాండ్ ఒక ఔన్స్ (31.1గ్రాములు) బరువుండే ఈ వెండి నాణెంలో ఎల్‌సీడీ థర్మామీటర్‌ను అమర్చి తయారు చేసింది.



50 మిల్లీమీటర్ల వ్యాసంలో ఉండే ఈ నాణెంలోని థర్మామీటర్ 14 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను సూచిస్తుంది. 1744 ఏప్రిల్ 25న ఆండర్స్ సెల్సియస్ మృతి చెందారు. ఆయన గౌరవార్థం ఆ దేశం 1744 నాణాలను మాత్రమే ఈ ఏడాది విడుదల చేసిందని కృష్ణకామేశ్వర్ తెలిపారు. ఒక వైపు ఆండర్స్ సెల్సియస్ ముఖం, సెల్సియస్ స్కేలు, రెండో వైపు రాణి ఎలిజబెత్-2 బొమ్మ ముద్రించిన ఈ నాణెం ముఖ విలువ మూడు వందల రూపాయలని చెప్పారు.     - అమలాపురం టౌన్

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top