దారి దోపిడీ ముఠా అరెస్ట్


మాచర్ల (గుంటూరు) : దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 లక్షల విలువైన 534 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు, ఆరు ద్విచక్రవాహనాలు, ఒక తపంచా, ఒక తుపాకి స్వాధీనం చేసుకున్నారు. జిల్లాకు చెందిన 9 మంది చిల్లర దొంగతనాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. వీరందరినీ చేరదీసిన అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఒక ముఠాగా ఏర్పాటు చేసి దారి దోపిడీలకు పాల్పడటం ప్రారంభించాడు.



అప్పటి నుంచి ఈ ముఠా గుంటూరు, ప్రకాశం, నల్లగొండ జిల్లాల పరిధిలో పలు దొంగతనాలు, దారి దోపిడీలు, కిడ్నాప్‌లు, హత్యలకు పాల్పడింది. చాలా రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఈ ముఠాను గుంటూరు పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ కే. నారయణ నాయక్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top