అధికారుల్లో గుబులు


  • పొలంబడి, స్వచ్ఛ భారత్‌పై అవగాహన

  •  కార్డులు, పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ

  •  మండలానికి రెండు బందాలు

  •  రోజుకో గ్రామంలో సమావేశం

  • గామాల్లో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కనీసం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరుచేయలేదు. రోజుకో కొత్త బూటకపు హామీతో రోజులను నెట్టుకొస్తున్న టీడీపీ సర్కారు ఏ ఒక్కటి అమలు చేయడం లేదు. రేషన్‌సరుకులు ఇవ్వడం లేదు. దీనికి తోడు ఆధార్‌కార్డును అన్ని సంక్షేమ పథకాలు లింకు పెట్టి లబ్ధిదారుల వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. రేషన్‌కార్డుల నుంచి రుణమాఫీ వరకు అన్ని పథకాల్లోకు సవాలక్ష ఆంక్షలు పెడుతూ లబ్ధిదారులను కుదిస్తూ వస్తోంది.



    దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈమేరకు జనం ఎక్కడ నిలదీస్తారోనన్న గుబులు అధికారుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా రైతు, డ్వాక్రా రుణ మాఫీలకు సంబంధించి రైతులు, మహిళలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు రుణాలు రద్దు చేస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకున్నాక హామీలను నెరవేర్చకపోవడం, కనీసం కొత్త రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు.



    ఇటీవల నిర్వహించిన పొలం బడి కార్యక్రమంలో గ్రామాలకు అధికారులు వెళ్లిన ప్రతీ సందర్భంలోను రుణమాఫీపై రైతులు నిలదీస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఆదర్శరైతు వ్యవస్థ రద్దుతో వారు ఉద్యమ బాట పట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తే రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీపై నిలదీస్తే ఏమి చెప్పాలన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top