అదిగో పెద్దపులి అడుగుజాడ..
మాచర్ల/విజయపురిసౌత్: ప్రముఖ పర్యాటక కేంద్రం నాగార్జునకొండపై పెద్దపులి సంచారాన్ని కొండపైనుండే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది చూశారు. సోమవారం రాత్రి కుక్కలు మొరుగుతుండటంతో సెక్యూరిటీ సిబ్బంది బయటకొచ్చి చూడగా మ్యూజియం పరిసరాల నుంచి పెద్ద పులి పరుగెత్తుతూ కనిపించింది. మంగళవారం ఉదయం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో నాగార్జునకొండ కంజర్వేషన్ అసిస్టెంట్ పర్యవేక్షణాధికారి ఢాకారెడ్డి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వారి ఉత్తర్వులతో బుధవారం మాచర్ల వన్యప్రాణి సంరక్షణాధికారులు రంగంలోకి దిగి పులి కాలి ముద్రలను సేకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పులి జాడ తెలుసుకొనేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాగార్జున కొండ అధికారులు అప్రమత్తమై ఈ ప్రాంతంలో లైటింగ్ ఏర్పాటు చేశారు.