పార్టీని బలోపేతం చేయడమే కర్తవ్యం

పార్టీని బలోపేతం చేయడమే కర్తవ్యం - Sakshi


వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి

 

 అనంతపురం అర్బన్ :

 జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీని బలోపేతం చేయడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలని ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన జిల్లా నాయకులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో ఆశించిన స్థానాలు దక్కకపోవడం వెనుక ఉన్న పరిణామాలు పరిశీలించామని, పార్టీలో ఉన్నవారందరికీ సముచిత న్యాయం చేస్తామని అన్నారు. రాబోవు మంచి రోజుల కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు.



పార్టీ బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. పార్టీ కార్యవర్గాలతో పాటు 14 అనుబంధ సంఘాల ఏర్పాటును త్వరలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మహిళలకు పెద్ద పీట వేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన 200 వాగ్ధానాలను అమలు చేయాలని ఒత్తిడి చేస్తూ ఈనెల 5న చేపట్టిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరే వరకూ ప్రజలకు బాసటగా నిలవాలని అన్నారు.



అనంతరం ఈ నెల 5న అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టబోయే నిరసన కార్యక్రమాల్లో భాగంగా కార్యాచరణ రూపొందించేందుకు వీకే భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకర్‌నారాయణ, జిల్లా మహిళ అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, పార్టీ రాష్ర్ట రాజకీయ వ్యవహారాల సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భూమన కరుణాకర్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి, న్యాయ విభాగం అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మీనుము నాగార్జున,



రైతు సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి, సీజీసీ సభ్యులు గురునాథ్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ర్ట అధ్యక్షుడు సాలాం బాబా, ఐటి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్ బాషా, ఏడీసీసీ ఛైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, ధర్మవరం, గుంతకల్లు, పుట్టపర్తి, శింగనమల నియోజకవర్గ నాయకులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వై. వెంకటరామిరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గం తిప్పేస్వామి, మడకశిర నియోజకవర్గ తిప్పేస్వామి, మాజీ మంత్రి నర్సేగౌడ, కుప్పం నియోజకవర్గ నాయకులు చంద్రమౌళి, నగర అధ్యక్షుడు



రంగంపేట గోపాల్‌రెడ్డి, కార్పొరేటర్ జానకి, జిల్లా నాయకులు బి. ఎర్రిస్వామిరెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, యోగీశ్వర్‌రెడ్డి, ధనుంజయ యాదవ్, ఆదినారాయణ, మీసాల రంగన్న, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, వీరాంజినేయులు, రిలాక్స్ నాగరాజు, కొర్రపాడు హుస్సేన్ పీరా, మిద్దె భాస్కర్‌రెడ్డి, ఆలూమూరు శ్రీనివాస్‌రెడ్డి, చింతకుంట మధు, మారుతి నాయుడు, పెన్నోబిలేసు, బండి పరుశురాం, సోమశేఖర్‌రెడ్డి, శ్రీదేవి, కృష్ణవేణి, ప్రమీల, ఆజీరా బేగం, దేవి, లక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top