అధికార పార్టీ నేత అరాచకం


 కొడవలూరు: అధికార పార్టీ నేతల అరాచకానికి పరాకాష్ట ఈ ఉదంతం.  ఎలాంటి లెసైన్స్ లేకుండానే మద్యం షాపు నిర్వహిస్తుండగా, ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసిన ఘటన మండలంలోని తాటాకులదిన్నెలో బుధవారం సాయంత్రం చోటుచేసుకొంది. ఇక్కడ జూన్ ఆఖరి దాకా కూడా స్థానిక అధికార పార్టీ నేత మద్యం దుకాణం నిర్వహించారు. జూలై నుం చి ప్రారంభమైన నూతన మద్యం దుకాణాల్లో ఇక్కడి దుకాణం అధికార పార్టీ నేతకు రాకుండా మరో వ్యక్తికి వచ్చింది. దీంతో ఏవిధంగానైనా ఆ మద్యం దుకాణాన్ని దక్కించుకోవాలని అధికార పార్టీ నేత ఎమ్మెల్యే అండతో అరాచకానికి దిగారు. పంచాయతీ అనుమతి లేదంటూ మద్యం దుకాణ భవనాన్ని కూలదోయించారు. అతడిని ఎదుర్కోలేకపోయిన మద్యం దుకాణదారు కంటైనర్ తెచ్చి అందులో మద్యం దుకాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా వదలని అధికార పార్టీ నేత ఆ దుకాణానికి పక్కనే గదిలో మద్యం నిల్వలు ఉంచి అమ్మకాలు ఆరంభించారు. ఈ సమాచారం ఎక్సైజ్ అధికారుల దృష్టికి పోవడంతో ఎలాంటి అనుమతి లేకుం డా గదిలో మద్యం నిల్వలు ఉండటంతో మద్యంతోసహా ఆ గదిని సీజ్ చేశారు. అయితే ఎక్సైజ్ అధికారులపై ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి రావడంతో సీజ్ చేసిన సరుకును మరలా వదిలేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం.

 

 మద్యం నిల్వలు ఉన్నందునే సీజ్ చేశాం: కోటేశ్వరరావు, ఎక్సైజ్ సీఐ

 తాటాకులదిన్నెలో మద్యం దుకాణానికి పక్కనే గదిలో మద్యం నిల్వలు ఉన్నాయని సమాచారం అందడంతో వెళ్లి వాటిని సీజ్ చేశాం. కానీ మద్యం నిల్వలు ఉంచిన వ్యక్తికి మరోచోట మద్యం దుకాణానికి లెసైన్స్ ఉంది. కానీ ఇక్కడ మద్యం నిల్వలు ఉంచడం చట్టవిరుద్ధమైనందున సీజ్ చేశాం. మద్యం నిల్వలను రాత్రికిరాత్రే తీయించాలని ప్రయత్నించాం. కానీ గురువారం దాకా గడువు అడిగినందున ఇచ్చాం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top