పోలవరం కమీషన్ల పరం!


పాత కాంట్రాక్టర్లపై 60సీ కింద వేటువేసి అస్మదీయులకు అప్పగిస్తోన్న సర్కారు

 

 సాక్షి, అమరావతి:
పోలవరం పేరుతో మరో రూ.3825.44 కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధమైంది. అందుకోసం ఆర్థిక శాఖ అభ్యం తరాలు, స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ  సూచనలను సర్కారు తోసిపుచ్చింది. పోలవరం కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.2240.68 కోట్ల నుంచి రూ.4375.77 కోట్లకు.. ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.1954.74 కోట్ల నుంచి రూ.3645.15 కోట్లకు పెంచేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ప్రయోజనాలతో ముడిపడిన పత్యేక హోదా ను తాకట్టు పెట్టి..  పోలవరం నిర్మాణ బాధ్య తలు దక్కించుకున్న 24 గంటల్లోనే ప్రధాన పనులు (హెడ్ వర్క్స్) అంచనా వ్యయం రూ.1482 కోట్లు పెంచేసి.. కాంట్రాక్టర్ అరుున టీడీపీ ఎంపీ రాయపాటి నుంచి పర్సెంటేజీలు దండుకున్న ‘ముఖ్య’ నేత తాజాగా మరో అడుగు ముందుకేశారు.



పోలవరం నిర్మాణ బాధ్యతలను చేజిక్కించు కోవడం వెనుక దాగిన రహస్య అజెండాను ప్రభుత్వం  నిస్సిగ్గుగా అమలుచేస్తోంది. పనులు చేయడం లేదనే సాకు చూపి పాత కాంట్రాక్టర్లపై జలయజ్ఞం నిబంధన 60సీ కింద వేటు వేసి.. అస్మదీయులకు అప్పగించి పర్సెంటేజీలు దండుకోవడానికి వ్యూహా త్మకంగా పావులు కదుపుతోంది. పోలవరం ఎడమ కాలువ పనుల్లో ఐదో ప్యాకేజీ కాం ట్రాక్టర్‌పై ఇప్పటికే వేటు వేసి.. పీఎస్కే- హెచ్‌ఈఎస్(జారుుంట్ వెంచర్) సంస్థకు రూ.142 కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తూ నవంబర్ 30న ఉత్తర్వు లు జారీ చేయడమే అందుకు తార్కాణం.

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top