క్షణికావేశంలో వివాహిత బలవన్మరణం

క్షణికావేశంలో వివాహిత బలవన్మరణం


ఉన్నత విద్యావంతురాలైన ఓ వివాహిత చిన్న గొడవల నేపథ్యంలో భర్త, తొమ్మిది నెలల పసికందును కూడా కాదనుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. తల్లి చనిపోయిందన్న విషయం గ్రహించలేని చిన్నారి ఆమె కోసం ఏడుస్తుండగా తండ్రి ఆడిస్తుండటం స్థానికులను కలచివేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య శాశ్వతంగా దూరం కావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్న భర్తను, తల్లి ప్రేమకు దూరమైన పసికందు పరిస్థితిని చూసి వారు కంట తడి పెట్టారు. గుడివాడలో గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.

 

గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : భర్తపై కోపంతో     క్షణికావేశంలో ఓ మహిళ ఉరి వేసుకుని బవలంతంగా ప్రాణం తీసుకుంది. పట్టణంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం కటక్‌కు చెందిన శ్రీవాసుచంద్ర సాహు మొవ్వ మండలం పెదప్రోలు గ్రామానికి చెందిన ఆకుల ప్రియాంక(24)ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరి ది ప్రేమ వివాహం. చల్లపల్లిలోని ఓ ప్రై వేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నపుడు వీరు ప్రేమించుకున్నారు.



వీరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో అప్పటి విజ యవాడ పోలీస్ కమిషనర్ సమక్షంలో వివాహం చేసుకుని, గుడివాడలో కాపురం పె ట్టా రు.  సాహు పెడనలోని ఓ ఇంజినీరింగ్ కా లేజీలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. ప్రి యాంక పట్టణంలోని ఇంజినీరింగ్ కాలేజీ, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకురాలిగా పనిచేసిం ది. కొంతకాలం గడిచాక గర్భవతి కావడంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటోంది. వీరికి తొమ్మిది నెలల కుమారుడు ఉన్నారు.



సాహు తరచూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడన్న కారణంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గు రువారం రాత్రి ఇద్దరూ భోజనం చేసి నిద్రిం చారు. కొంతసేపటి తర్వాత తాను వేరే గదిలో పడుకుంటానని ప్రియాంక ముందు గదిలోకి వచ్చింది. ఈ విధంగా తరచూ వేరే గదిలో పడుకోవడానికి అలవాటు పడిందని భర్త సా హు చెబుతున్నాడు. గురువారం రాత్రి అలా చెప్పినా తాను పట్టించుకోలేదని తెలిపాడు.



అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కుమారు డు పాలకు లేవడంతో భార్యను పిలిచినట్లు చెప్పాడు. ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతో ముందుగదిలోకి వచ్చి చూడగా ఫ్యానుకు ఉరివేసుకుని ఉన్నట్లు తెలిపాడు. వెంటనే 108కు ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి పరీ క్షించారు. ఆమె అప్పటికే మృతిచెందిందని ధ్రు వీకరించారు. ఈ ఘటనపై టూటౌన్ ఎస్సై విజయకుమార్ విచారణ జరిపి కేసు నమోదు చేశారు. ప్రియాంక మరణం పై ఆమె తల్లిదండ్రులు ఏవిధమైన అనుమానాన్ని వ్యక్తం చేయలేదని పోలీసులు తెలి పారు.  



కంటతడి పెట్టిన స్థానికులు

 

ఎంతో ధైర్యంగా జీవితాన్ని సాగిస్తున్న సాహు కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం స్థానికులను కంట తడి పెట్టించింది. పసికందు ను వదిలేసి తల్లి ఇంత పని ఎలా చేసిందని కొందరు అంటుండగా, క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాల వల్ల జరిగే అనర్థాలు ఈ విధంగానే ఉంటాయని మరికొందరు వ్యాఖ్యానించారు. తల్లిపాల కోసం అల్లాడుతున్న పసికందును చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top