నామినేషన్ల ఘట్టం పూర్తి


  •      మొత్తం నామినేషన్ల సంఖ్య 333

  •      చివరిరోజు పోటాపోటీగా నామినేషన్లు

  •      సాయంత్రం 6వరకు కొనసాగిన ప్రక్రియ

  •      అసెంబ్లీకి భారీ సంఖ్యలో నామినేషన్లు

  •  సాక్షి, చిత్తూరు: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో మొదటి దశ నామినేషన్ల దాఖలు పూర్తరుుంది. 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సాగిన నామినేషన్ల ప్రక్రియలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 333 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజు శనివారం (19వ తేదీ) జిల్లాలోని 14 అసెంబ్లీ రిటర్నింగ్ కార్యాలయాలు, చిత్తూరు, రాజంపేట రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులతో కిటకిటలాడాయి.



    చివరిరోజు 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.  ఇప్పటివరకు  చిత్తూరు లోక్‌సభకు 11 మంది, రాజంపేట లోక్‌సభకు 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. చిత్తూరు జాయింట్ కలెక్టర్, రాజంపేట ఆర్వో శ్రీధర్‌కు పురందేశ్వరి నామినేషన్ పత్రాలు అందజేశారు.



    చిత్తూరు లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ కలెక్టర్ కార్యాలయంలో అదనపు జేసీకి నామినేషన్‌పత్రాలు అందజేశారు. వారం రోజులుగా సాగిన నామినేషన్ల సందడి శనివారం సాయంత్రంతో ముగిసింది. ఇక గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారంలో ఒకరితో ఒకరు పోటీ పడనున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నాలుగురోజుల ముందే  నామినేషన్లు దాఖలు చేసి, ప్రచారంలో అందరికన్నా ముందుగా దూసుకుపోతున్నారు.



    జిల్లాల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి,  మాజీ ఐఏఎస్ అధికారులు చంద్రమౌళి, వెలగపల్లి వరప్రసాద్, తుడ మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సినీనటి ఆర్‌కే.రోజా, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తదితరులు ఉన్నారు.

     

    పదుల సంఖ్యలో నామినేషన్లు

     

    శనివారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావటంతో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు క్యూలో ఉన్న అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిం చేందుకు అధికారులు చర్యలు చేపట్టా రు. దీంతో సాయంత్రం 6 గంటల వర కు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. మదనపల్లె, శ్రీకాళహస్తి, చిత్తూరు వంటి చోట్ల చివరి రోజు పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశా రు. కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి వెంకటరమణ, పలమనేరులో టీడీపీ అభ్యర్థి ఆర్‌వీ.చంద్రబోస్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు నామినేషన్లు వేసినవారిలో సీపీఎం, జై సమైక్యాంధ్ర, బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల అభ్యర్థులు ఉన్నారు. స్వతంత్రులు కూడా పెద్దసంఖ్యలో అసెంబ్లీకి నామినేషన్లు వేశారు. మదనపల్లె నుం చి ఎంఐఎం అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారు.

     

    మదనపల్లె నుంచి టీడీపీ రెబల్స్


     

    మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాన్ని టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ నుంచి చల్లపల్లి నర్సింహారెడ్డి నామినేషన్ వేశారు. అదే సమయంలో పొత్తుకు చెల్లుచీటి ఇచ్చి, టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, గంగరాపు రాందాస్‌చౌదరి, రెడెప్ప అనే ముగ్గురు రెబల్స్‌గా బరిలోకి దిగారు. పూతలపట్టు మండలంలో ప్రవీణ్ అనే వ్యక్తి కాంగ్రెస్ రెబల్‌గా బరిలోకి దిగారు. ఇలా జిల్లాలో కొన్ని చోట్ల రెబల్స్ బెడద ఉంది. ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ముందుజాగ్రత్తగా తమపార్టీ తరఫునే తమ భార్యలను, భర్తలను, బంధువులను డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయించారు. చంద్రగిరి, చిత్తూరు, తిరుపతి, పలమనేరు, పుంగనూరు ఇలా అన్ని ప్రధాన నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థు లు తమ తరపున డమ్మీ అభ్యర్థుల తోనూ నామినేషన్లు దాఖలు చేయిం చటం గమనార్హం.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top