కరువు జిల్లాను ఆదుకోండి

కరువు జిల్లాను ఆదుకోండి


ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను

►  కోరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక

►  ఏడేళ్ల ప్రాజెక్టు ద్వారా ఉపశమనం కల్గిస్తాం : ఐప్యాడ్ ప్రతినిధి వెల్లడి


 

 

కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులున్నాయని  ప్రపంచ బ్యాంకు ద్వారా జిల్లాను ఆదుకోవాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.. డ్రాఫ్ట్ ఐఎఫ్‌ఏడీ(ఐప్యాడ్) ప్రతినిధులను కోరారు. శనివారం రాత్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ప్రపంచ బ్యాంకు తరఫున వచ్చిన ఐప్యాడ్ ప్రతినిధులతో ఎంపీ సమావేశమై జిల్లా కరువు పరిస్థితులను వివరించారు. ఇటలీకి చెందిన ఐప్యాడ్ ప్రతినిధులు అండ్రీనెప్యూడి ఐసాటూర్ , ఆ సంస్థ ఇండియా ప్రతినిధులు విన్సెం ట్ డార్లాంగ్, సన్‌ప్రీత్ కౌర్.. గురు, శుక్రవారాల్లో ఓర్వకల్లు, ఆళ్లగడ్డ, డోన్ మండలాల్లో కరువు పరిస్థితులను, ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. ప్రపంచ బ్యాంకు తరపున ఈ బృందం జిల్లాలో పర్యటిస్తోంది. శనివారం స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంది.



ముందుగా జిల్లాకలెక్టర్ సి.హెచ్.విజయమోహన్‌ను ఆయన ఛాంబర్‌లో కలిశా రు. కలెక్టర్ జిల్లాలోని కరువు పరిస్థితులను ఐప్యాడ్ ప్రతినిధులకు వివరించారు. అనంతరం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమావేశమైన ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. జిల్లాలో వరుసగా కరువు వస్తుండటం వల్ల రైతు లు తీవ్రమైన కష్టాల్లో మునిగి తేలుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆదోని, కర్నూలు డివిజన్లలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. జిల్లా మ్యాపు ద్వారా కరువు ప్రాంతాలను చూపించా రు. ప్రపంచ బ్యాంకు ద్వారా కరువు జిల్లాకు చేయూతనివ్వాలని సూచించా రు. డ్రాఫ్ట్ ఐప్యాడ్ టీమ్ లీడర్ అండ్రి నెఫ్యూడి మాట్లాడుతూ తొలి విడతలో రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించి కరువు పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.



మరో టీమ్ జూన్ నెల 5వ తేదీన జిల్లాకు వచ్చి కరువు పరిస్థితులను మరోసారి పరిశీలి స్తుందని తెలిపారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాాశం జిల్లాలో ప్రపంచ బ్యాంకు నిధులతో ఏడేళ్ల ప్రాజెక్టు ద్వారా ఉపశమనం కల్గిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీడీఏ గణపతి, ఏడీఏ వెంకటేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనరేట్ అధికారి రమణ తదితరులు పాల్గొన్నారు. ఐప్యాడ్ ప్రతినిధులు జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం తిరిగి      వెళ్లనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top