అన్నదాత.. విజేత

అన్నదాత.. విజేత - Sakshi


ఆగిన నీటి తరలింపు నిర్ణయం

రైతులు, వైఎస్సార్ సీపీ ఉద్యమ ఫలితం

ఇది తాండవ రైతుల విజయం..

వైఎస్సార్ సీపీ నేత ఉమాశంకర్ గణేశ్

రిలే దీక్షల నిర్ణయం విరమణ


 


నాతవరం: తాండవ రిజర్వాయర్ నీటిని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు తరలించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈ మేరకు తాండవ నీటిని ఏలేరు కాలువలోకి తరలించడానికి లక్ష్మీపురం వద్ద తీసిన కాలువలను  అధికారులు తిరిగి  కప్పేశారు. కాలువలు కప్పేసిన ప్రాంతాన్ని ైవైఎస్సార్‌సీపీ  నర్సీపట్నం నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేశ్, రాష్ట్ర   కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు అంకంరెడ్డి జెమీలు, రైతులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ, నీటి తరలింపుకోసం తీసిన కాలువలు తిరిగి కప్పేశారంటే  ప్రభుత్వం నీటి తరలింపును విరమించుకున్నట్టేనని.. ఇది తాండవ రైతుల విజయమని చెప్పారు.  ఈ సందర్భంగా చుట్టు పక్కల గ్రామాల రైతులు   వైఎస్సార్‌సీపీ నాయకుల వద్దకు వచ్చి కృతజ‘తలు తెలిపారు.  మొదట్లో అధికారుల హడావుడి చూసి ప్రభుత్వం తాండవ నీటిని విశాఖకు తరలించుకుపోతుందని ఆందోళన చెందామన్నారు. కేవలం వైఎస్సార్‌సీపీ రైతులు పక్షాన నిలిచిపోరాటం  చేయడం వల్లే  నీటి తరలింపును  విరమించుకున్నారన్నారు. అనంతరం   గణేశ్ విలేకరులతో మాట్లాడుతూ  ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయాలని  చూస్తే ఊరుకునేది లేదన్నారు.





తాండవ నీటిని విశాఖకు తరలిస్తామని రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు  ఈనెల 12న విశాఖలో ప్రకటన చేసిన మరునాడే ఈ ప్రాంతాన్ని పరీశీలించి ఒక చుక్క తాండవ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించినా అడ్డుకుంటామని హెచ్చరించామని గుర్తుచేశారు. త ర్వాత రైతులతో కలిసి ఈనెల 13 నుంచి వివిధ రకాల ఆందోళనలు చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చామన్నారు. తాండవ నీరు రానున్న కాలంలో రైతుల సాగుకు తప్ప ఏ ఇతర  అవసరాలకు  తరలించాలన్న ఆలోచన ప్రభుత్వం చేయరాదని హెచ్చరించారు. ప్రభుత్వం  ప్రజా సమస్యల కంటే స్వప్రయోజనాలు కోసం అధిక ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. జెమీలు మాట్లాడుతూ మంత్రి అయ్యన్నపాత్రుడికి తెలిసే తాండవ నీటి తరలింపు ఆలోచన జరిగిందన్నారు.  ఆయన  ఆదేశాల మేరమే  ఇక్కడి అధికారులు కాలువ  పనులు  చేపట్టారని, ఇలాంటి నీచ రాజకీయాలు మంచిదికాదని సూచించారు.


 

రిలే నిరాహార దీక్షలు విర మణ


తాండవ నీటి తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  ఈ నెల 23 నుంచి ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులతో కలిసి  చేయ తలపెట్టిన రిలే  నిరాహారదీక్షను విరమించుకుంటున్నట్టు గణేశ్ తెలిపారు. ఇక్కడ తీసిన కాలువలు మూసేయడంతో తాండవ నీటి తరలింపును ప్రభుత్వం విరమించుకున్నట్టేనన్నారు.  వైఎస్సార్‌సీపీ 10 రోజులుగా చేస్తున్న  ఆందోళనకు  మద్దతుగా నిలిచిన రైతులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా  నాయకులు పైల సునీల్, చిటికిల వెంకటరమణ, శెట్టి నూకరాజు, పైత పోతురాజు, నర్సీపట్నం  మండల రూరల్ పార్టీ అధ్యక్షుడు సుర్ల సత్యనారాయణ,  మాకవరపాలెం మండల పార్టీ అధ్యక్షుడు రుత్తల సత్యనారాయణ, సర్పంచ్  లాలం లోవ తదితరులు  పాల్గొన్నారు.


 


తరలింపు ఆగినట్టే..  డీఈ

ఈ విషయంపై తాండవ జలాశయం డీఈ చిన్నంనాయుడును ‘సాక్షి’ విలేకరి వివరణ కోరగా నీటి తరలింపు ఆగినట్టేనని స్పష్టంచేశారు. రైతుల ఆందోళన, నీరు ఇవ్వరాదని తాండవ జలాశయం కమిటీ సభ్యుల  తీర్మానం  నివేదికను జిల్లా కలెక్టర్, ఇరిగే షన్ ఎస్‌ఈకి నివేదించామన్నారు. తాండవ నీరు ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలులేదంటా రాష్ట్రమంత్రి అయ్యన్నపాత్రుడు కూడా స్వయంగా చెప్పారని తె లిపారు. కాగా, తాండవ నీటి తరలింపును వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆందోళన తీవ్రతరం చేయడం, నిరశన దీక్షలకు పూనుకోవడంతో  ప్రభుత్వం దిగివచ్చిందని తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top