ముదురు పోలీసులు !

ముదురు పోలీసులు ! - Sakshi

  •      ఎస్పీనే బదిలీ  చేయించేందుకు పూనుకున్న సీఐలు

  •      ‘ఎర్ర’ అక్రమాలు బట్టబయలవుతాయనే భయంతోనే....

  •      సీఐల బదిలీల్లోనూ చక్రం తిప్పుతున్న వైనం...

  • క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖ దారి తప్పింది. తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని దొర(ఎస్పీ)నే బదిలీ చేయించేందుకు కంకణం క ట్టున్నారు ‘అయ్య’గార్లు!. ఎర్రచందనం కేసుల వ్యవహారం కీలక దశలో ఉన్న తరుణంలో ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ బదిలీ వ్యవహారమే ఇందుకు సంబంధించిన కథాంశం.



    సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టులకు సంబంధించిన కేసులు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయి. 178మంది దాకా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 12మంది అంతర్జాతీయ దొంగ లు ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రధాన పాత్రధారులు వీరే. అరుుతే వీరిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ ప్రకటించినా, అందులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా అరె స్ట్ చేయాల్సిన దొంగలు 800 మంది దాకా ఉన్నారు.



    ఎర్రస్మగ్లర్ల నెట్‌వర్క్ ఎలా ఉంది ? దొంగలెవరు ? వారికి సహకరించిన పోలీసు అధికారులు ఎవ రు? అటవీశాఖ అధికారులు ఎంతమం ది ? వారి వెనుక ఉన్న రాజకీయనేతలు ఎవరు ? అనే వివరాలను ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ సాక్ష్యాలతో సేకరించి రిపోర్ట్ తయారు చేశారు. ఇందులో ఇద్దరు డీఎస్పీలతో పాటు సీఐలు, ఎస్‌ఐల పాత్ర కూడా ఉన్నట్లు ఎస్పీ తేల్చినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి చేరవేస్తారనే సమయంలో ఎస్పీ రామకృష్ణ బదిలీ ‘వార్త’ వినాల్సి వచ్చింది.

     

    బదిలీకి వీరే కారణమా?

     

    ఎస్పీ రామకృష్ణ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తే అందులో తమ పేర్లు కచ్చితంగా ఉంటాయని, ఉన్నాయని కొంతమంది సీఐలు తెలుసుకున్నారు. ఇదే జరిగితే సస్పెన్షన్, ప్రమోషన్‌లపై ప్రభావంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని బెంబేలెత్తిపోయారు. దీంతో ‘ఎర్ర’ వ్యవహారంలో హస్తమున్న కొంతమంది సీఐలు ఓ గ్రూపుగా ఏర్పడి తాము ఎలా భయటపడాలని చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు.



    సీఎంతో నేరుగా పరిచయమున్న ఓ సామాజిక వర్గానికి చెందిన సీఐలు చొరవ తీసుని నేరుగా సీఎంతోనే ఈ అంశాన్ని చర్చించినట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము పార్టీ కోసం, పార్టీ నేతలు, కార్యకర్తలను రక్షించామని, ఇప్పుడు తాము కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడాలని వేడుకున్నట్లు తెలిసింది. దీంతో సీఎం చంద్రబాబు కూడా సీఐల మాటలు ఆలకించి, వారిని కాపాడే చర్యల్లో భాగంగానే ఎస్పీపై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. దీని వెనుక చంద్రగిరి, కార్వేటినగరం, పాకాలలో పనిచేసి ప్రస్తుతం వేరేచోట కొనసాగుతున్నవారు  ఉన్నట్లు తెలిసింది. వీరితో పాటు చిత్తూరు ఎస్పీ పరిధిలో పనిచేసి ప్రస్తుతం బయట ఉన్న మరో నలుగురు సీఐలు కూడా ఉన్నట్లు సమాచారం.

     

    సీఐల బదిలీల్లోనూ....

     

    త్వరలో జరగబోయే సీఐల బదిలీల్లోనూ ఈ సీఐలే చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. వారు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు తమ అస్మదీయులకు కూడా ఆశించిన సర్కిల్ దక్కేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.  అధికారపార్టీలోని మంత్రుల అండతో వీరు డీవోల జారీలో తమదైన ‘ముద్ర’ వేయనున్నారని పోలీసులు జోరుగా చర్చించుకుంటున్నారు. దీంతో నే ఈ నెల 23న రావాల్సిన డీవోలు నెలాఖరుకు వాయిదా పడ్డాయని కూడా తెలుస్తోంది.

     

    చివరలో కొంత ఉత్కంఠ..

     

    ఎస్పీ రామకృష్ణ బదిలీ ఆగిపోనుందని ప్రచారం జరిగింది. దీంతో ఆయన బదిలీ కోసం శ్రమించిన సీఐల వెన్నులో వణుకుపుట్టింది. అదే జరిగితే తమ పరి స్థితి ఏంటని మధనపడుతుండగా సోమవారం రాత్రి రామకృష్ణ రిలీవ్ అయ్యారు. దీంతో సీఐలదే పైచేయి అయ్యింది.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top