పురుగుమందు తాగి దంపతుల ఆత్మహత్య

పురుగుమందు తాగి దంపతుల ఆత్మహత్య - Sakshi


► బొగ్గుబట్టీ నిర్వాహకుడి వేధింపులు తాళలేకే..

► రూ.30 వేల బాకీ ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో మనస్తాపం

► డబ్బులు ఇవ్వకుంటే ఆయన కొడతాడని భయాందోళన

► అందుకే పురుగుమందు తాగి చనిపోతున్నామని భార్య వాంగ్మూలం

► హనుమంతునిపాడు మండలం కూటాగుండ్లలో ఘటన..


కూటాగుండ్ల (హనుమంతునిపాడు) : బొగ్గు బట్టీ నిర్వాహకుల వేధింపులు తాళలేక మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మండల పరిధి కూటాగుండ్ల పంచాయతీలో గురువారం జరిగిం ది. వివరాలు.. ఉలవపాడు మండలం మన్నేటికోటకు చెందిన కత్తి ఏడుకొండలు (40), మల్లేశ్వరి(35) దంపతులు కూటాగుండ్లలో బొగ్గుబట్టీ నిర్వహిస్తున్న ఉప్పుటూరి కోటేశ్వరరావు, చేబ్రోలు రాజేష్‌ల వద్ద పని చేస్తున్నారు.


వీరిద్దరిదీ కొరిశపాడు మండలం. వీరు మూడేళ్ల నుంచి ఇక్కడ బొగ్గు బట్టీ నిర్వహస్తున్నారు. ఏడుకొండలు దంపతులు రెండేళ్ల నుంచి బొగ్గు బట్టీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో దంపతులు కోటేశ్వరరావుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. యజమాని ఇటీవల నుంచి తరుచూ బాకీ తీర్చమని అడగడంతో అక్కడ పని మానేసి పాకల వద్ద పనికి వెళ్లారు. విషయం తెల్సుకుని బొగ్గుబట్టీ యజమాని ఏడుకొండలు వద్దకు వెళ్లి ఆయన్ను పొదిలి తీసుకొచ్చి నాలుగు రోజులు బంధించాడు.


తిరిగి కూటాగుండ్ల బొగ్గు బట్టీ వద్దకు తీసకొచ్చాడు. బొగ్గు బట్టీ వద్ద వైరుతో కొట్టి బెదిరించి స్వగ్రామంలో ఉండే ఇంటి పట్టాలు, లేక నగదు ఇవ్వాలని ఏడుకొండలును బెదిరించారు. అనంతరం కాగితాలు రాయించుకున్నారు. ఏడుకొండలు స్వగ్రామం మన్నేటికోట వెళ్లి కుటుంబ సభ్యులను ఇంటి పట్టాలు అడిగారు. వారు పట్టించుకోకపోవడంతో దంపతులు బుధవారం రాత్రికి బొగ్గుబట్టీ వద్దకు వచ్చారు. ఇంటి పట్టాలు ఇవ్వకంటే యజమాని కొట్టి చంపేస్తాడనే భయంతో గురువారం వేకువ జామున బ్రాందీలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ వెంటనే అక్కడే పని చేస్తు న్న మల్లేశ్వరి తన తమ్ముడు శ్రీనుతో విషయం చెప్పింది.


స్థానికులు అప్రమత్తమై 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి దంపతులను కనిగిరిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. మృతుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య రమణకు ఇద్దరు పిల్లలు. రెండో భార్య మల్లేశ్వరికి ఇద్దరు పిల్లలు.


మల్లేశ్వరి మరణ వాంగ్మూలం

బొగ్గు బట్టీ యజమాని కోటేశ్వరావుకు డబ్బులు ఇవ్వకున్నా, ఇంటి పట్టాలు ఇవ్వకున్నా కొట్టి చంపేస్తాడనే భయంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామని చనిపోక ముందు మల్లేశ్వరి మరణ వాంగ్మూలం ఇచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. కోటేశ్వరరావు చేతుల్లో దెబ్బలు తిని ఎందుకు చావాలనే పురుగుమందు తాగి ఆత్మహత్మకు పాల్పడాలని దంపతులం నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొంది.


కనిగిరి సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ హరిబాబులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.  దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రులో పోస్టుమార్టం చేయించినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top