పెందుర్తికి చొక్కాకుల... విశాఖ ఉత్తరానికి తైనాల

పెందుర్తికి చొక్కాకుల... విశాఖ ఉత్తరానికి తైనాల - Sakshi

  •  వైఎస్సార్‌సీపీ నూతన సమన్వయకర్తల నియామకం

  • సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్తగా చొక్కాకుల వెంకట్రావును నియమించారు.  విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా తైనాల విజ య్‌కుమార్ నియమితులయ్యారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలమేరకు వీరిద్దరినీ నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.



    ఇంతవరకు పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న గండి బాబ్జీ స్థానంలో చొక్కాకుల వెంకట్రావును నియమించారు. దాంతో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలు తక్షణం అమలులోకి వస్తాయని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top