కేసీఆర్.. ఇన్నాళ్లుగా ఏం చేశావు?

కేసీఆర్.. ఇన్నాళ్లుగా ఏం చేశావు? - Sakshi


సీఎంపై విరుచుకుపడ్డ రేవంత్‌రెడ్డి

ఏపీ మోసం చేస్తే 5 నెలలుగా ఎక్కడ పడుకున్నావు?

నువ్వు తెలంగాణకు పట్టిన శని..


 

హైదరాబాద్: ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఇవ్వకుండా అన్యాయం చేస్తుంటే ఐదునెలలుగా ఏం చేశావు? నువ్వు ముఖ్యమంత్రి వా? సన్నాసివా.. దద్దమ్మవా? కృష్ణపట్నం నుం చి విద్యుత్ ఇవ్వలేదని కేంద్రానికి ఫిర్యాదు ఎందుకు చేయలేదు? శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి న్యాయబద్ధమైతే కృష్ణా రివర్‌బోర్డుకు నువ్వెందుకు వెళ్లలేదు? 1996లో 69 జీవో వచ్చినప్పుడు చంద్రబాబు దగ్గర తాబేదారుగా ఉన్న వు. అప్పుడు తెల్వదా అన్యాయమని? అప్పుడెం దుకు నోరు విప్పలేదు? సిగ్గులేదా?..’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుపై టీడీపీ నేత రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ తెలంగాణకు పట్టిన శని అని విమర్శించారు. శనివారం రేవంత్‌రెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మంత్రివర్గ సమావేశం తరువాత చెప్పినవన్నీ అబద్ధాలన్నారు. ఆయన అసమర్థతను, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబును తిడుతూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు.



ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ, కేంద్ర పంపిణీల ద్వారా జూన్ 18 నుంచి అక్టోబర్ 13 వరకు ఐదు నెలల్లో ఏపీలో కన్నా తెలంగాణలోనే 273 మెగావాట్ల విద్యుత్ అదనంగా వినియోగమైందని పేర్కొన్నారు. ‘‘ల్యాంకో సంస్థ 150 మెగావాట్ల విద్యుత్ ఇస్తానంటే కొననన్నవ్. కమీషన్లు రావనా? ల్యాంకో రాజగోపాల్‌తో రాజకీయ వైరమా? నీ మూర్ఖత్వంతో రాష్ట్ర ప్రజలకు విద్యుత్ కష్టాలు తెచ్చిపెట్టి ఇప్పుడు కథలు చెబుతున్నావు. బీహెచ్‌ఈఎల్, ఎన్టీపీసీ, టాటా కంపెనీల నుంచి మూడేళ్లలో 14 వేల మెగావాట్ల విద్యుత్ వస్తుందని.. అందులో ఆరు వేల మెగావాట్లు తెలంగాణకు వస్తే 24 గంటలు కరెంటు ఇస్తానని మళ్లీ అబద్ధాలు చెబుతున్నవు. 2017 నాటికి ఆ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ప్రారంభమైతే... నువ్వు విధించే ఏ శిక్షకైనా సిద్ధం. లేదంటే ముక్కు నేలకు రాస్తావా?..’’ అని రేవంత్ సవాల్ విసిరారు.



అఖిలపక్షం పెడితే నిజాలు తెలుస్తాయి



కృష్ణపట్నంలో విద్యుత్‌వాటా, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై అఖిల పక్షంలో చర్చిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని, ఏపీ, తెలంగాణ వాదనల్లో ఎవరి తప్పేంటో తేలుతుందని తెలంగాణ టీడీపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచిం చారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రాథోడ్, సీతక్క విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 27, 28 తేదీల్లో 10 జిల్లాల్లోని అన్ని మండల కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాలని నిర్ణయించినట్టు టీడీపీ నేత, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top