కేసీఆర్, చంద్రబాబులపై క్రిమినల్ కేసులు

కేసీఆర్, చంద్రబాబులపై క్రిమినల్ కేసులు - Sakshi


న్యూఢిల్లీ: నిన్న కాక మొన్న కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడులపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మొత్తం 12 మంది కేంద్ర మంత్రులు, 44 సహాయ మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదైయ్యాయి. అయితే ఏడుగురు కేంద్ర మంత్రులపై అత్యంత భయంకరమైన క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు 'ది అసోసియేషన్ ఆఫ్ డెమెక్రాటిక్ రిఫార్మ్స్' అనే సంస్థ శుక్రవారం ఇక్కడ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.


గత రెండేళ్ల కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదైన వారి జాబితాను ఈ సందర్బంగా ఏడీఆర్ విడుదల చేసింది. అందులోభాగంగా కేసీఆర్, చంద్రబాబులపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.తెలంగాణలో అత్యథికంగా 90 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని పేర్కొంది. ఆ తర్వాత స్థానాలు వరుసగా 56 శాతంతో ఆంధ్రప్రదేశ్, 34 శాతంతో కర్ణాటక, 27 శాతంతో ఒడిశాలు ఉన్నాయని తెలిపింది. మిజోరాం, మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు చెందిన చెందిన ఒక్క మంత్రిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top