సాంకేతికతను గ్రామాల్లోకి తీసుకెళ్లాలి

సాంకేతికతను గ్రామాల్లోకి తీసుకెళ్లాలి - Sakshi


కలెక్టర్ బాబు.ఎ

విజయవాడ :
సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామస్థాయికి తీసుకు వెళ్లగలిగేతేనే పూర్తి స్థాయిలో డిజిటల్ ఇండియా విధానంలో విజయం సాధించినవారవుతామని జిల్లా కలెక్టర్ బాబు.ఏ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం డిజిటల్ ఇండియా వారోత్సవ కార్యక్రమాల జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో వ్యక్తులను గుర్తించడంలో అత్యంత భద్రతతో కూడిన ఆధార్ 12 అంకెల గుర్తింపు వ్యవస్థను డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా భారతదేశం నిర్వహించిందని అన్నా రు. త్వరలోనే బందరు రోడ్డును స్మార్ట్ సిటీలో భాగంగా గోల్డెన్‌మైన్ ప్రాజెక్టుగా రూపుదిద్దుతున్నామని చెప్పారు.



అంతర్జాతీయంగా పేరొం దిన సిస్కో సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టినట్లు వివరించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పూర్తిస్థాయి డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రయినీ కలెక్టర్ సలోని సిడాన్, నూజివీడు ట్రిఫుల్ ఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సాయినాథ్, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజి అసోసియేట్ ప్రొఫెసర్ వరుణ్ తదితరులు, జిల్లా ఇన్‌ఫర్‌మెట్రిక్ అధికారి శర్మ, ఎన్‌ఐసీ సిబ్బంది, మీసేవా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

 

సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించండి

విజయవాడ :
ఈ ఏడాది ఇంకా పాఠ్యపుస్తకాలు అందని విద్యార్థులకు సకాలంలో అందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు. స్థానిక ఆటోనగర్‌లో పాఠ్యపుస్తకాలు భద్రపరచిన గోడౌన్‌ను శనివారం ఉదయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లో ఉన్న పాఠ్యపుస్తకాలను కలెక్టర్ బాబు.ఎ, ట్రయినీ కలెక్టర్ సలోని సిడాన్‌తో కలిసి వ్యక్తిగతంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఇంకా కొన్ని పాఠ్యపుస్తకాలు చేరలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.



దీనిపై వెంటనే ఏఏ పాఠశాలలు, కళాశాలలకు పా ఠ్యపుస్తకాలు అందలేదో నివేదికలు అందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు వివరించారు. గోడౌన్‌లకు పుస్తకాలు ఏఏ సమయాల్లో పంపిణీ దారులు పంపుతున్నారో ముందస్తుగానే సమగ్ర సమాచారం తెప్పించుకుని పంపిణీలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కోరారు. అనంతరం కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారిని, ఇం టర్మీడియెట్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.



జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల పాఠ్యపుస్తకాలను దశలవారీగా పంపనున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. ప్రాంతీయ ఇంటర్‌మీడియెట్ అధికారి ఎం.రాజారావు మాట్లాడు తూ ఇంటర్ విద్యార్థులకు సరఫరా చేయాల్సి న పాఠ్యపుస్తకాలను తీసుకువెళ్లాల్సిందిగా క ళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top