సందిగ్ధంలో టీచర్లు


ఆ బదిలీ జీవోలు అమల్లో ఉన్నట్టా? లేనట్టా...?

ఎటూ తేల్చక ఉపాధ్యాయుల సతమతం

ఏడు వేల మందికి తప్పని నిరీక్షణ

గురువుల చక్కర్లతో చదువులు గాలికి

విద్యార్థుల భవిష్యత్తుపై పడనున్న ప్రభావం




ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మూడడుగులు ముందుకు.. ఆరడుగుల వెనక్కి.. అన్నట్టు మారింది. బదిలీలు...  హేతుబద్ధీకణ... ఇలా నెలరోజులుగా రకరకాల జీవోలతో తంతు సాగుతూనే ఉంది. స్పష్టత తేని ప్రభుత్వ విధానాలవల్ల పిల్లల చదువు గాలికిపోతోంది. ఏ పాఠశాలలు విలీనమవుతాయి?... ఏ ఉపాధ్యాయులకు బదిలీలు తప్పనిసరి కానుంది?... అన్నది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. సందట్లో సడేమియాలా... ఏకీకృతానికి కేంద్రం రాజముద్ర వేయడంతో అసలు బదిలీలకు మళ్లీ కొత్త ఉత్తర్వులు వస్తాయా... ఎన్నాళ్లలో వస్తాయన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేకుండా పోతోంది.



విజయనగరం అర్బన్‌:  ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ సందిగ్ధంలో ఉంది. చివరి సారిగా ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం రెండు రోజుల క్రితమే ఈ ప్రక్రియను ముగించేసి వాటిపై అభ్యంతరాలను కూడా ఇప్పటికే తీసుకోవాల్సి ఉంది. ఉపాధ్యాయుల సీనియార్టీ తుది జాబితాను సైతం ప్రకటించాలి. ఈ నెల 28, 29వ తేదీల్లో బదిలీలకు ఆప్షన్స్‌ ఇవ్వాలి. ఇటీవల మంత్రి గంటా ఇచ్చిన హామీతో ఆ జీవోలను సవరించాలి. కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీనివల్ల వాటి అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేప«థ్యంలో బదిలీ షెడ్యూల్‌ ఆదేశాల జీవోలు అమలులో ఉన్నట్లో... లేన ట్లో కూడా తెలియడం లేదని ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు. జిల్లాలో 3,334 పాఠశాలలున్నాయి.



వీటిలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న 14,690 మంది ఉపాధ్యాయుల్లో సుమారు 7 వేల మంది బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.రేషనలైజేషన్‌లో మిగులు పోస్టులుగా ఉన్న వారు, 8 సంవత్సరాల సర్వీసులు పూర్తిచేసుకున్నవారు తప్పనిసరిగా బదిలీ కావాలి. ఇలాంటి వారు రెండువేల మంది వరకు ఉన్నారు. వీరంతా బదిలీలతోనే సతమతం అవుతుంటే ఇక విద్యార్థుల చదువులు ఏరీతిన సాగుతా యన్నది వేరే చెప్పనవసరం లేదు. బదిలీల ప్రక్రియపై వెంటనే నిర్ణయం ప్రకటించని పక్షంలో ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.



దరఖాస్తులకు మళ్లీ అవకాశం...?

వెబ్‌ కౌన్సెలింగ్‌ రద్దు, పాయింట్ల కేటాయింపులపై సవరణ తదితర అంశాలపై ఇటీవల చర్చల్లో మంత్రి గంటా సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో గతంలోని చివ రి జీఓలపై సవరణ మార్గదర్శకాలు ఇప్పటికే విడుదల చేయాలి. కానీ అవేవీ పట్టించుకోవడం లేదని, మంగళవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో ముఖ్యమంత్రి నిర్వహించిన చర్చలనంతరం ఈ సవరణ మార్గదర్శకాలు విడుదల అయ్యే అవకాశం ఉందని ఉపా« ద్యాయవర్గాలు భావించాయి. ఈ దరిమిలా వెబ్‌కౌన్సెలింగ్‌పై అవగాహనలేమితో దరఖాస్తు చేసుకోలేని వారు, రెండు విద్యాసంవత్సరాల కనీస అర్హతగా సవరించడంతో వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా మళ్లీ అవకాశం ఉంటుందన్న ఆశాభావంతో కొందరు ఉన్నారు. చర్చల ఫలితంగా పాయింట్ల కేటాయింపుల్లో సవరణలు అనివార్యమైన కారణంగా ఆన్‌లైన్‌లోనే ఆ ప్రక్రియను(ఆప్‌డేట్‌ చేయాలని) చేపట్టాలని, పాయింట్లను సవరిస్తూ అందరికీ మళ్లీ దరఖాస్తు చేసుకోమంటే కష్టసాధ్యమవుతుందని మరికొందరు పేర్కొంటున్నారు.



బదిలీల పేరుతే స్కూళ్లు ఎగ్గొడితే చర్యలు

బదిలీల పేరుతో పాఠశాలకు ఎగనామం పెట్టివస్తే కచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఏ సమస్య ఉన్నా సంబంధిత ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓలకు ఇవ్వాలి. ఎవరైనా పాఠశాల వేళల్లో బయట కనిపిస్తే చర్యలు తప్పవు. ఉత్తర్వులు వచ్చే వరకు ఎక్కడి వారు అక్కడే విద్యార్థులకు పాఠాలు చెప్పాలి. బదిలీ సాకుగా చూపి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.

– ఎస్‌.అరుణకుమారి, డీఈఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top