పెద్దల సభకు నారాయణ

పెద్దల సభకు నారాయణ


ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి త్వరలో జరిగే ఉప ఎన్నికలలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణను నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఒక స్థానానికి ఆగస్టు 21వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారాయణను తన మంత్రివర్గంలోకి జూన్ 8వ తేదీన తీసుకున్నారు. అయితే ఆయన ఉభయ సభల్లో వేటిలోనూ సభ్యుడు కారు. మంత్రిగా నియమితులైన వాళ్లు ఏదో ఒక సభలో ఆరు నెలల్లోగా సభ్యులు కావాలన్న నిబంధన ఉంది.



మరోవైపు, శాసన మండలికి మే 21వ తేదీన కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేశారు. దాంతో అప్పటినుంచి ఆ సీటు ఖాళీగా ఉంది. ఆ స్థానానికి నారాయణనే నిలబెట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఈ ఉప ఎన్నికకు ఆగస్టు నాలుగో తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. ఆగస్టు 11వ తేదీలోగా నామినేషన్లు దాఖలుచేయాలి. ఉపసంహరణకు తుదిగడువు ఆగస్టు 14. అవసరమైతే 21వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. అసెంబ్లీలో తమకు మెజారిటీ ఉండటంతో నారాయణ ఎన్నిక ఖాయమని టీడీపీ భావిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top