టీడీపీ Vs టీడీపీ

టీడీపీ Vs టీడీపీ - Sakshi


కౌన్సిల్ సాక్షిగా బయటపడ్డ విభేదాలు

టౌన్ ప్లానింగ్ అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని తీర్మానం




కదిరి: టీడీపీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కౌన్సిల్ సాక్షి గా  బయటపడ్డాయి. మంగళవారం చైర్‌పర్సన్ సురయాభాను అధ్యక్షతన కౌన్సి ల్ సమావేశం వాడీవేడిగా సాగింది. కుటాగుళ్లలోని మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం లేదంటూ చైర్‌పర్సనే ఈ అంశాన్ని లేవనెత్తారు. వెంటనే పను లు ఆపేయాలని కమిషనర్ రామ్మోహన్ ను ఆదేశించారు. ఇందుకు టీడీపీకే చెంది న కుటాగుళ్ల వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ అభ్యంతరం తెలిపారు. అభివృద్ధి పనులు ఆపేయాలని చెప్పడం మూర్ఖత్వమే అవుతుందన్నారు.  ఈ విషయాన్ని అజెండా లో చేర్చాలని తాను డీఈ వెంకటరమణకు 3 నెలలకు ముందే లేఖ ఇచ్చానని గుర్తు చేశారు.



అయితే.. ఈ అంశం తన దృష్టికి రానందున పనులు ఆపాలని చైర్‌పర్సన్  పునరుద్ఘాటించారు. చైర్‌పర్సన్‌కు మద్దతుగా టీడీపీకి చెందిన కౌన్సిలర్ షబ్బీర్ నిలవగా..  కౌన్సిలర్ చంద్రకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు మద్దతుగా నిలి చారు. ఆఖరుకు ఈ అంశంపై  కమిటీని వేయాలని నిర్ణయించి.. తాత్కాలికంగా మూడు రోజుల పాటు పనులు ఆపాలని నిర్ణయించారు. మున్సిపల్ రిజర్వ్ స్థలా లు కబ్జాకు గురవుతున్నా  అధికారులు మౌనం దాల్చారని, పాలకపక్షం ఎందుకు దీనిపై మెతకవైఖరిని అవలంబిస్తోందని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కిన్నెర కళ్యాణ్, అజ్జుకుంటు రాజశేఖర్‌రెడ్డి, జగన్, శివశంకర్ నాయక్, జిలాన్ ప్రశ్నించారు.



వీరికి టీడీపీ కౌన్సిలర్ శంకర్ మద్దతు తెలుపుతూ.. రాధికా థియేటర్ ముందు  10 అడుగులు ఆక్రమించి ఇల్లు నిర్మిస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిం చారు. చివరకు టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్‌ప్రసాద్‌ను ప్రభుత్వానికి సరెం డర్ చేయాలని తీర్మానించారు. కాం ట్రాక్టు కార్మికుల 3 నెలల వేతనాలను ఇచ్చే బాధ్యతను బినామీ కాంట్రాక్టర్ బాబాకు  కట్టబెడితే  న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని  వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ కళ్యాణ్ హెచ్చరించడంతో కమిషనర్ ఆధ్వర్యంలో చెల్లించేలా నిర్ణయించారు. నిజాంవలీ కాలనీలో ఓ వీధి తన వార్డు పరిధిలోకి వస్తుందని, ఆ కాలనీ అభివృద్ధికి మంజూరైన రూ.కోటితో సదరు వీధిలో  అభివృద్ధి పనులు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ మైనుద్దీన్ కోరారు. కాగా.. సమావేశం జరుగుతుండగానే సీపీఐ నాయకులు లోపలకు దూసుకొచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top