నెల్లూరు మేయర్ కు చెక్


సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేయర్ అజీజ్‌కు టీడీపీ లక్ష్మణ రేఖను గీ సింది. కార్పొరేషన్‌లో మేయర్‌కు విస్తృత అధికారాలు లేకుండా అజీజ్‌ను రబ్బర్‌స్టాంప్‌లా వాడుకోవాలని భావిస్తునట్లు విశ్వసనీ య సమాచారం. అందులో భాగంగానే నెల్లూరుకు చెందిన తమ్ముళ్ల సూచన మేరకు సీఎం చంద్రబాబు ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించి కట్టడి చేసినట్లు ప్రచారం జరుగుతోం ది. మేయర్‌గా ఎన్నికైన తొలినాళ్లలో అజీజ్ నగరంలో తాగునీటి సమస్య పరిష్కారం, అండర్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.1,500 కోట్లు తెస్తానని పదేపదే చెప్పారు. ఈ విషయంలో ఆయనకు ప్రభుత్వం నుంచి చేదు అనుభవం ఎదురైంది. నిధుల కోసం ఆయన పంపిన నివేదికను సాంకేతిక కారణాలతో సున్నితంగా తోసిపుచ్చినట్లు సమాచారం. తాజాగా కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల విషయంలోనూ మేయర్‌కు అవమానం జరిగినట్లు తెలిసింది. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండానే కమిషనర్ షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొద్దిరోజుల క్రితం టీడీపీ కార్పొరేటర్ ఒకరు ఏకంగా తానే మేయర్‌నని బ్యానర్లు కట్టించుకున్న ఘటన మేయర్ అజీజ్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. రాజకీయంగా నష్టపోతున్నానని లోలోన మదనపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం అటువంటిదేం లేదని అంటున్నాయి.  

 

 అసహనంతో తప్పుల మీద తప్పులు

 

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరిన మేయర్ అజీజ్ ఇటుపార్టీలో, అటు కార్పొరేషన్‌పై పట్టు సాధించలేక కొందరు కార్పొరేటర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులను ఉపయోగించుకుని వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా బుధవారం 54వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ఆయన అనుచరులపై టీడీపీ నేతలతో దౌర్జన్యానికి దిగారు. రంగనాయకులపేటలో గురువారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఏకంగా పోలీసులతోనే కార్పొరేటర్లపై అధికార జులుం చూపించారు. ఎటువంటి గొడవలు లేకపోయినా.. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను టార్గెట్ చేసుకుని దౌర్జన్యంగా గెంటివేయించారు. పొలీసులు కొందరు కార్పొరేటర్ల చొక్కాలు పట్టుకుని లాగి బయటకు వెళ్లగొట్టారు. దుర్భాషలాడుతూ బయటకు గెంటివేశారు. నాలుగురోజుల క్రితం నగరంలోని ఓ జిమ్ నిర్వాహకుడితో గొడవపడి, తన అధికార బలంతో ఏకంగా ఆ జిమ్‌ను మూయించిన ఘనత నగర ప్రథమ పౌరుడైన మేయర్‌కే దక్కిందని పలువురు చర్చింకుంటున్నారు. తాము అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటినేవీ పట్టించుకోకుండా... మేయర్‌గా తన బాధ్యతలను మరచి గిల్లికజ్జాలకు సమయం  కేటాయిస్తున్నట్లు నగరవాసులు విమర్శిస్తున్నారు. ఇకనైనా గిల్లికజ్జాలు మాని సహచర సభ్యులపై దూకుడు ప్రదర్శించటం కంటే.. వారి సహకారంతో నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top