'ఏకపత్నీవ్రతుడ్నే టీటీడీ ఛైర్మన్గా నియమించాలి'
హైదరాబాద్: వాక్శుద్ది, ఏకపత్నీవ్రతుడ్నే టీటీడీ ఛైర్మన్గా నియమించాలని అధికార పార్టీకి చెందిన... పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లో సదరు ఎమ్మెల్యే మాట్లాడుతూ.... తమ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత మంత్రికి తెలియకుండానే ... టీటీడీ స్పెసిఫైడ్ అథారటీని నియమించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీకి అథారటీని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ముందుగా చెబితే సొమ్ము ఏం పోయేదని సదరు ఎమ్మెల్యే అన్నారు.