ఇది ‘దేశం’ మార్కు..అవినీతి టపాసు

ఇది ‘దేశం’ మార్కు..అవినీతి టపాసు - Sakshi


బాణసంచా కాల్చినప్పుడు వచ్చే వన్నెవన్నెల కాంతులు, ‘ఢాంఢాం’, ‘చిటపట’ సవ్వడులు బాలలకు ఆనందం. బాణసంచా అమ్మితే వచ్చే కాసుల గలగలలు వ్యాపారులకు ఆనందం. మరి.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, దుకాణాలకు అనుమతిని గుప్పెట్లో పెట్టుకుంటే.. దీపావళి పేరుతో స్వీయ ‘ధనత్రయోదశి’ జరుపుకోవచ్చు. ఇదీకాకినాడలో కొందరు టీడీపీ నేతల పన్నాగం. అయితే వ్యాపారుల కడుపు మండడంతో ఈ పథకం ‘తుస్సు’మంది.

 

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లా కేంద్రం కాకినాడలో ఏటా దీపావళికి రూ.10 కోట్ల బాణ సంచా వ్యాపారం జరుగుతుంది. ఈసారి అంతకు మించే అమ్మకాలు ఉంటాయని అంచనా. బాణ సంచా దుకాణాల కేటాయింపును సొమ్ము చేసుకోవాలని అధికార పార్టీ నాయకులు పన్నాగం పన్నారు. నగరంలో అధికారికంగా అనుమతి ఇచ్చే 120 దుకాణాలను గంపగుత్తగా ఒకరికే కేటాయించేలా అధికారులను ఒత్తిడి చేసి లక్షలు వెనకేసుకోవాలనుకున్నారు. అయితే బాణ సంచా వ్యాపారులు సామూహికంగా నిరసించి, తిరగబడడంతో వారి పాచిక పారలేదు. అయినా తెలుగుతమ్ముళ్లు తమ పలుకుబడిని ప్రయోగించి 20 దుకాణాలను తాము చెప్పిన వారికి కేటాయించేలా అధికారులను ఒప్పించినట్టు సమాచారం.  కాకినాడలో దీపావళికి  కుళాయిచెర్వు (70), బోట్‌క్లబ్ (25), జగన్నాథపురం డ్రైఫిష్ మార్కెట్(25) వద్ద బాణసంచా దుకాణాలను కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో డ్రా ద్వారా కేటాయించేవారు. ఇలాగే గత ఏడాది అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హయాంలో సిఫార్సులకు తావులేకుండా డ్రా పద్ధతిలో కేటా యించారు. కలెక్టర్,     - మిగతా 2లోఠ

 

 కాకినాడ ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, అగ్నిమాపక, తూనికలు కొలతలు, కార్మిక, వాణిజ్యపన్నులు తదితర శాఖల సమన్వయంతో పర్మనెంట్ లెసైన్సు, తాత్కాలిక లెసైన్సు (ఆర్డీఓ ఇస్తారు)ఉన్న వారికి ఈ దుకాణాలు కేటాయించారు. అప్పట్లో శాఖలకు ‘మామూళ్లు’ లేకుండా చేశారు. ఒక్కో షాపునకు కార్పొరేషన్ ద్వారా రూ.25 వేలు వసూలు చేశారు. ఆ మొత్తంలో వేలలో రెవెన్యూకు (రూ.200), అగ్నిమాపకశాఖకు (రూ.600), వాణిజ్యపన్నుల శాఖకు(రూ.8000), కార్పొరేషన్‌కు (రూ.750), విద్యుత్ సహా షెడ్ల ఏర్పాటుకు(రూ.3000)...ఇలా సుమారు రూ.12,550 అధికారికంగా చెల్లింపులు జరిగేవి. మిగులు సొమ్ములను తిరిగి ఇచ్చేశారని వ్యాపారులు చెబుతున్నారు.

 

 దుకాణ ం కే టాయింపునకు రూ.50 వేలు..

 ఈ ఏడాది అందుకు భిన్నంగా అధికారపార్టీ నేతల అనుచరులు, బంధుగణం మిలాఖతై ఒకే గుత్తేదారుకు మొత్తం 120 దుకాణాలను కట్టబెట్టే ప్రయత్నం చేశారు.  ఒకో దుకాణానికి రూ.50 వేల ధర నిర్ణయించారు. అధికారులపై వారు తెచ్చిన ఒత్తిళ్లు ఫలించాయనుకుంటున్న తరుణంలో శనివారం వ్యాపారులంతా తిరగబడ్డారు. మున్సిపల్ కమిషనర్ గోవిందస్వామి, ఆర్డీఓ అంబేద్కర్‌ల వద్దకు తరలివెళ్లి నిరసన వ్యక్తం చేశారు. గతంలో మాదిరే దుకాణాలు కేటాయించాలని కోరారు. దీంతో చేసేది లేక తెలుగుతమ్ముళ్లు మెట్టు దిగి నిర్ణయాధికారాన్ని అధికారులకు విడిచి పెట్టక తప్పలేదు. ఈ క్రమంలో ఒక్కో దుకాణం నుంచీ రూ.25,000 నుంచి రూ.35,000 వసూలు చేయాలని నిర్ణయించారు. జగన్నాథపురం వద్ద రూ.25,000, బోట్ క్లబ్ వద్దరూ.30,000, రాజాట్యాంక్ వద్ద రూ.35,000 వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే టీడీపీ వారు అధికారులను ఒత్తిడి చేసి, మొత్తం 120 దుకాణాల్లో 20 దుకాణాలను తమ వారికి ఇచ్చేలా ఒప్పించినట్టు తెలిసింది. అవి కూడా వ్యాపారం భారీగా జరిగే రాజా ట్యాంక్ వద్ద కేటాయించనున్నట్టు సమాచారం.

 

 నిబంధనలకు విరుద్ధంగా మెయిన్‌రోడ్లో షాపు!

 కాగా టీడీపీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల బంధుగణం కోసం నిబంధనలను ‘సీమటపాసుల్లా’ పేల్చేసి, మెయిన్ రోడ్లో అపోలో ఆస్పత్రి ఎదురుగా దుకాణం ఏర్పాటుకు అధికారులను ఒప్పించినట్టు తెలుస్తోంది. అక్కడ విక్రయించేందుకు ఆ ప్రజాప్రతినిధుల బంధువులు అరకోటి విలువైన బాణసంచా సిద్ధం చేసుకున్నారని సమాచారం. కాకినాడ నుంచి ఒకప్పుడు కృష్ణా ఎంపోరియం, శ్రీఘాకోళపు సుభద్రయ్య, ఆతుకూరి రఘురామయ్య, సూపర్‌బజార్ తదితర సంస్థలు జిల్లా కేంద్రం నుంచి హోల్‌సేల్‌గా  రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల లావాదేవీలను జిల్లా అంతటా నిర్వహించేవి.

 

 పాతికేళ్లుగా లెసైన్సుదారులందరినీ నిబంధనల పేరుతో దూరం పెట్టిన యంత్రాంగం ఇప్పుడు అకస్మాత్తుగా అధికారపార్టీ నేతల అనుచరగణానికి, బంధుగణానికి మెయిన్‌రోడ్లో దుకాణం ఎలా కట్టబెడతారని పదేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్న వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.కాగా దుకాణాల కేటాయింపు మున్సిపల్ కమిషనర్ గోవిందస్వామిని వివరణ కోరగా గత ఏడాది మాదిరే ఇప్పుడూ బాణసంచా దుకాణాలు కేటాయిస్తున్నామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని అనుమతులకు సింగిల్ విండో పద్ధతినే అమలు చేస్తామన్నారు. మొత్తం 100 దుకాణాలు కేటాయించే నిర్ణయం జరిగిందన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top