వెలుగుల శాఖలో...నేతల దందా!

వెలుగుల శాఖలో...నేతల దందా! - Sakshi


విజయనగరం మున్సిపాలిటీ : ఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో భర్తీ అవుతున్న షిఫ్టు ఆపరేటర్‌ల పోస్టులను బజారు సరుకుగామార్చేశారు. కనీసం ఆ నియామకాలు చేపట్టే కాంట్రాక్టర్‌కు కానీ...విద్యుత్ శాఖ అధికారులకు కానీ  ఈ పోస్టుల భర్తీలో అవకాశం కల్పించకపోవడంతో వారు మొర్రోమంటున్నారు.  ఈపీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు ఈ పోస్టులు భర్తీ చేస్తారు.  వీటి భర్తీలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలి, ఎస్సీఎస్టీ రిజర్వేషన్ పాటించాలి. ఈ మేరకు సీఎండీ గతంలో మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఆ ని బంధనలను తమకు ఇష్టంవచ్చినట్టుగా మార్చేశారు.  

 

 నియోజకవర్గాల వారీగా పంపకాలు...?

 ఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్‌సర్కిల్ పరిధి లో  40 వరకు షిప్టు ఆపరేటర్ పోస్టులు ఖాళీ  అయ్యా యి. వీటిలో విజయనగరం డివిజన్ పరిధిలో 19 మంది ఉండగా, బొబ్బిలి డివిజన్‌లో మరో 21 మం ది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.  గతంలో ఈ పోస్టులన్నీ ఈపీడీసీఎల్ సీఎం డీ జారీ చేసిన మార్గదర్శలు ఆధారంగా భర్తీ చేసేవారు. పోస్టుల భర్తీలో స్థా నికులు ప్రాధాన్యం కల్పించేవారు. అలాగే ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ అమలు చేసేవారు. అయితే ఇప్పుడా నిబంధలన్నీ మారిపోయాయి. నచ్చినోడికి, డబ్బు ఇచ్చినోడికే ఉద్యోగం అన్న నిబంధనలు మాత్రమే అమలయ్యాయి.

 

 ప్రతి నియోజకవర్గం నుంచి ఆయా ఎమ్మెల్యేలు విద్యుత్ శాఖ అధికారులకు పదుల సం ఖ్యలో సిఫారసులు చేశారు. అధికారులకు సైతం ఎవ రు చెప్పిన విధంగా పోస్టుల కేటాయింపులు చేయా లో తెలియక సతమతమయ్యారు. దీంతో  ప్రజాప్రతి నిధలే ఒక ఒప్పందానికి వచ్చి నియోజకవర్గాల వారీ గా పంపకాలు చేసుకున్నట్టు తెలిసింది.  ఈ మేరకు ఆ జాబితాను సదరు కాంట్రాక్టర్, విద్యుత్  శాఖ అధికారులకు  పంపించినట్లు  తెలుస్తోంది.   ఇప్పటికే ఈ నియామకాలు పూర్తి చేసేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇలా ఒక్కొక్క పోస్టుకు రూ 3 నుంచి రూ5 లక్షల వరకు దండుకుని జేబులు నింపుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వాస్తవానికైతే విద్యు త్ శాఖ నిబంధనల మేరకు ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగం లో ఐటీఐ అర్హత ఉన్న వారిని విద్యుత్ ఉపకేంద్రాల్లో ఆపరేటర్లుగా నియమించాల్సి ఉంటుంది.

 

 వాటిని జిల్లాలో విద్యుత్ ఉప కేంద్రాలు నిర్వహించే కాంట్రాక్టర్‌ల ఆధ్వర్యంలో నియమిస్తారు. ఒక్కొక్క కేంద్రాని కి నలుగురు చొప్పున షిప్టు ఆపరేటర్‌లను ఎంపిక చే సుకుని  సంబంధిత జాబితాను ఈపీడీసీఎల్ అధి కా రులకు పంపితే వారే నియామక ఉత్తర్వలు జారీ చేస్తా రు. అయితే ఈ పోస్టుల భర్తీలో కీలక భూమిక పోషించే కాంట్రాక్టర్‌తో పాటు, విద్యుత్ శాఖ అధికారులకు ఒక్క షిప్టు ఆపరేటర్ పోస్టు కూడా కేటాయిం చలేదు. దీంతో వారు మొర్రోమంటున్నారు.గత  ప్ర భుత్వ హయాంలో జిల్లాలో ఒక్కరే జాబితా లు పం పించి, శాసిస్తుండే వారు. అయితే కాంట్రాక్టర్, అధికారుల కోటా కింద కొన్ని పోస్టులను వదిలేసి మి గిలిన  వాటికి జాబితాలు  ఇచ్చేవారు. ఈ మేరకు పో స్టుల భర్తీ జరిగేది. ఈ సారి కనీసం ఒక్క పోస్టు కూడా కాంట్రాక్టర్‌కు దక్కకుండా పోయిందని సమాచారం.

 

 జేఎల్‌ఎం ఎంపికల్లో

 ప్రతిభ చూపిన వారికి మొండిచేయి...

 జూనియర్ లైన్ మెన్‌పోస్టుల ఎంపిక సందర్భంగా ప్రతిభ కనబరిచిన వారికి అప్పట్లో ఉద్యోగాలు దక్కలేదు.  ఆ సందర్భంగా  త్వరలో  భర్తీ చేసే  షిఫ్టు ఆపరేటర్ పోస్టుల్లో వారికి అవకాశం కల్పిస్తామని  ఈపీడీసీఎల్  అధికారులు రెండు నెలల క్రితం ప్రకటన చేశారు. అయితే అటువంటి ప్రతిభ గల అభ్యర్థులకు  చివరికి మొండి చెయ్యే మిగిలింది.  షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీలో అధికార పార్టీ నాయకుల జోక్యం మితిమీరడంతో పోస్టుల భర్తీలో వారికి అవకాశం దక్కని పరిస్థితి నెలకొంది. ఈ పోస్టుల భర్తీలో  ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి  మార్గదర్శకాలకు తావులేకుండా నాయకులు పావులుకదపటంటో అభ్యర్థులు ఉసూరుమంటున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top