మంత్రి డైరెక్షన్‌లో బరితెగిస్తున్న తమ్ముళ్లు

మంత్రి డైరెక్షన్‌లో బరితెగిస్తున్న తమ్ముళ్లు - Sakshi


సాక్షి ప్రతినిధి తిరుపతి : అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇలాకాలో తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగి పోతూనే ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా.. భూకబ్జాలతో అందినకాడికి దోచుకోనే యత్నం చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని బీభత్సం సృష్టిస్తున్నారు. పోలీసులు, అధికారులు మాముళ్ల మత్తులో జోగుతూ అధికార పార్టీ నేతలకు అండగా నిలుస్తుండడంతో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. మంత్రి కనుసన్నల్లోనే దాడులు జరుగుతుండడంతో వారిని అడ్డుకునే వారే లేరు.



 ఏర్పేడు మండలం పెనుమల్లం గ్రామంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులను అడ్డుకుంటున్నారని మంగళవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లను ధ్వంసం చేశారు. వారిపై దాడిచేశారు. తమ పొలాల వద్ద ఉన్న ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మునికృష్ణ, హరిప్రసాద్, మురళి  టీడీపీ నాయకుల ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు బొజ్జల చంద్రశేఖర్, నాగరాజా, శంకరయ్యతో పాటు మరో 15 మంది కత్తులు, గొడ్డళ్లు, గునపాలతో ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు.



ఇంటి ముందున్న బొలోరో వాహనాన్ని పగులగొట్టారు. అడ్డుకోబోయిన వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మునికృష్ణయ్య, హరిప్రసాద్, మురళి, రాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యయి. దీంతో  గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా పోలీసులు సకాలంలో గ్రామంలోకి చేరుకుని దాడులను అదుపు చేయలేకపోయారు. గతంలో ఇదే మండలంలో రాజులవారి కండ్రికకు చెందిన దాము యాదవ్‌పై తెలుగుదేశం నేతలు దాడిచేశారు. పెనుమళ్లం గ్రామంలోనే ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త  కేశవులు అనే వ్యక్తిపై వికృతమాల చెరువు వద్ద దేశం నాయకులు దాడిచేసి గాయపరిచారు. శ్రీకాళహస్తి రూరల్ మండలం వేడాం, అక్కుర్తి గ్రామాల్లో సైతం తెలుగుదేశం నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేశారు.  తొట్టంబేడు మండలంలోని కాసారంతో పాటు శ్రీకాళహస్తి పట్టణంలో ఎక్కడో ఒకచోట తెలుగు తమ్ముళ్లు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు.



 శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి నిత్యం ఇలాంటి దాడులు  సర్వ సాధారణంగా మారాయి. పోలీసులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. నామమాత్రంగా  కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. వీటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయకపోతే అక్కడ శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది.

 

 కక్షగట్టి దాడులు చేశారు..

 అక్రవుంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నందుకే కక్ష గట్టి వూ కుటుంబాలపై దాడి చేశారు. కత్తులు, రాడ్‌లు, గునపాలతో దాడికి పాల్పడ్డారు. అరిచి కాళ్లు పట్టుకున్నా వదల్లేదు. ఇళ్లపై పడి వస్తువులన్నీ సర్వనాశనం చేశారు.

 - వరలక్ష్మి, రమేష్ అవ్ము, పెనువుల్లం

 

 ఎస్పీ టీడీపీ ఏజెంటా?

 ఏర్పేడు: తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి టీడీపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయుణస్వామి అన్నారు. బుధవారం వుండలంలోని పెనువుల్లంలో అధికార పార్టీ నాయుకులు ధ్వంసం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లను పరిశీలించారు. ధ్వంసం చేసిన ఇళ్లు, సావుగ్రిని చూసి చలించిపోయారు. వెంటనే అర్బన్ ఎస్పీతో ఫోన్‌లో వూట్లాడారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఇక్కడి పరిస్థితిని చూసి నిందితులను అరెస్ట్ చేయూలని కోరారు. ఇంతజరిగినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.



ఎస్పీ తగినంతగా స్పందించకపోవడంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. వుూడు ఇళ్లు ధ్వంసం చేసి, నలుగురికి తీవ్రగాయూలైతే ఇంతవరకు నిందితులను అరెస్ట్‌చేయుకపోవడం దారుణవున్నారు. అటవీశాఖా వుంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి తన అనుచరులతో అరాచకాలు సృష్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. నిందితులను అరెస్ట్‌చేసి కఠినంగా శిక్షించకుంటే ఆందోళన చేపడతావున్నారు.

 

  మంత్రి దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయ్

 ఏర్పేడు : అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సవున్యయుకర్త బియ్యుపు వుధుసూదన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం వుండలంలోని పెనువుల్లంలో ‘పచ్చ’నాయుకులు ధ్వంసం చేసిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నాయుకుల ఇళ్లను పరిశీలించారు. నియోజకవర్గంలో మంత్రి సూచనల మేరకు అధికారపార్టీ నాయుకులు ఇసుకదందా, భూకబ్జాలు చేస్తున్నారన్నారు. మంత్రి దౌరన్యాలపై ఆయున స్వగ్రావుమైన శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరులో ధర్నా చేయునున్నట్లు ప్రకటించారు.



ఎస్‌ఐ మల్లికార్జునరావు టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిందితులను అరెస్ట్‌చేసి కఠిన చర్యలు తీసుకోకుంటే గురువారం పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహిస్తావుని హెచ్చరించారు. ఆయన వెంట రాష్ట్ర నాయుకులు అంజూరు శ్రీనివాసులు, ప్రవీణ్, జిల్లా ప్రధానకార్యదర్శి బత్తల నాగభూషణనాయుుడు, వుండల అధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు, సింగిల్‌విండో అధ్యక్షుడు తాళ్లపాక నాగార్జునరెడ్డి, ఎంపీటీసీలు రమణయ్యు యూదవ్, మనిరత్నంరెడ్డి, జనార్దన్‌రెడ్డి, నాయుకులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top