వేలానికి రైతన్న పరువు!

వేలానికి రైతన్న పరువు!


రైతుల బంగారం వేలానికి బ్యాంకులు సిద్ధం

గత రెండేళ్లలో పోరుయింది పది కిలోల పైవూటే

తాకట్టు పెట్టి ఆశలు వదులుకున్న కుప్పం అన్నదాతలు


 

 సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలో రైతులకు గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఆయన మాటలు నమ్మినందుకు అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మొన్నటిదాకా బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారు నగలు చేతికొస్తాయని ఆశపడ్డ అన్నదాతకు తీవ్ర నిరాశే ఎదురయ్యింది. రుణమాఫీకాకపోవడంతో ఇప్పటికే పదికిలోల బంగారు ఆభరణాలను వేలం వేసిన బ్యాంకులు ఇప్పుడు మరో నాలుగు కిలోల బంగారాన్ని వేలం వేసి, రైతుల పరువును బజారుకీడ్చే పనిలో నిమగ్నమవడం విమర్శలకు తావిస్తోంది.శాంతిపురం: కుప్పం రైతన్నల పరువు వురోవూరు బ్యాంకుల్లో వేలానికి వచ్చింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రుణవూఫీ హామీని నమ్మిన పాపానికి అష్ట కష్టాలతో సంపాదించుకున్న బంగారం అప్పనంగా బ్యాంకుల పాలవుతోంది. నగలతో పాటు తమ పరువు కూడా బజారున పడుతోందని రైతులు తల్లడిల్లుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో గత ఏడాది రైతులు తాకట్టు పెట్టిన పది కిలోలకు పైగా బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయి. ఈ దారుణం వురువక వుుందే వురోవూరు వేలానికి ఏర్పాట్లు సాగుతున్నారుు. వివిధ బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న 4 కిలోలకు పైగా రైతుల బంగారాన్ని త్వరలో అప్పులకు జమ కానుంది. బంగారం ధరలు స్థిరంగా ఉండకపోవడం, అప్పులు, వాటి వడ్డీ నానాటికీ పెరుగుతుండడంతో బ్యాంకులు తవు సొవుు్మ రాబట్టుకోవటానికి వేలానికి సిద్ధమవుతున్నాయి.





వేలం బాటకుప్పంలోని కెనరా బ్యాంకు 400 వుంది రైతుల బంగారాన్ని ఈనెల 12వ తేదీన వేలం వేసింది. 56 వుంది రైతుల బంగారాన్ని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఈనెల 18న వేలం వేయునున్నట్టు ప్రకటించించింది. మిగతా బ్యాంకులు కూడా ఇదే బాటన సాగుతున్నారుు. నగల వేలానికి సంబంధించి ఆయూ బ్యాంకులు నిబంధనల మేరకు రైతుల వివరాలతో పత్రికల్లో ప్రకటనలు ఇస్తుండటంతో అన్నదాతలు అవవూనాలకు గురవుతున్నారు. ఏడాది క్రితం కొందరు రైతులు వడ్డీ వూత్రం చెల్లించి వేలం నుంచి తప్పించుకున్నారు. అప్పుడు తప్పించుకున్న రైతుల బంగారమే ఇప్పుడు వుళ్లీ వేలానికి వచ్చింది.



 అప్పుల ‘కుప్ప’ం

వ్యవసాయు, ఉద్యానవన పంటల సాగులో అత్యుత్తవు ప్రతిభ చూపుతున్న కుప్పం నియోజకవర్గ రైతులు పెట్టుబడుల కోసం భారీగా అప్పులుచేశారు. పేద, వుధ్య తరగతి వారే వ్యవసాయుంలో సింహభాగం ఆక్రమించడంతో పెట్టుబడుల కోసం పాట్లు తప్ప లేదు. కానీ ప్రకృతి కరుణించక, కరువు కోరల్లో చిక్కుకుని పంటలతో పాటు వాటిపై పెట్టిన పెట్టుబడులు కూడా దక్కలేదు. పర్యవసానంగా 2014 వూర్చి చివరికి బ్యాంకుల్లో రూ.60.46 కోట్ల పంట రుణాలు, బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రూ.186.54 కోట్ల రుణాలు నెత్తికి వచ్చారుు. నియోజకవర్గంలో ప్రభుత్వం విడతల పేరుతో రుణవూఫీకి కరుణించిన మొత్తం రూ.40 కోట్లే కావటంతో మిగతా రూ.200 కోట్లకు పైగా భారం అన్నదాతలకు తప్పలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top