ఏకగ్రీవం కోసం పాట్లు

ఏకగ్రీవం కోసం పాట్లు - Sakshi


ఎన్నికల హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి

పార్టీ కేడర్‌లో అసంతృప్తి

కాంగ్రెస్ మాటల యుద్ధం

తెలుగుదేశం అధినాయకత్వంలో ఆందోళన


 

తిరుపతి:  ఉప ఎన్నికను ఎలాగైనా ఏకగ్రీవం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ తంటాలు పడుతోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో ఆందోళనకు గురవుతోంది. మరోవైపు పార్టీ అభ్యర్థిపై కేడర్‌లో అసంతృప్తి గుబులు. దీంతో ఏకగ్రీవం వైపే ఆలోచి స్తోంది. మంత్రి గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థి సుగుణమ్మ బుధవారం విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఏకగ్రీవానికి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నేతలను సైతం అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అగ్రనేతలు పైకి నటిస్తూన్నారే తప్ప చిత్తశుద్ధితో పనిచేయలేదని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు, అభ్యర్థి అల్లుడు సంజయ్ సైతం ఏకాంతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.



వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే జన్మభూమి కమిటీల్లో పూర్తిగా కాంగ్రెస్ నుంచి తన వెంట వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం.. పూర్వం నుంచి టీడీపీని నమ్ముకుని ఉన్న వారి అసంతృప్తికి కారణమైనట్లుగా పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.   ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయాలని ఇప్పటికే కొంతమంది నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా మద్యం షాపులు, రిక్రియేషన్ క్లబ్‌లను సైతం వదలకుండా ముఖ్యనేత మాముళ్లు వసూలు చేస్తున్నారని ఆ ప్రభావం ఎన్నికల్లో అభ్యర్థి విజయావకాశాలపై పడుతోందేమోననే భయం స్పష్టంగా కనిపిస్తోంది. కార్పొరేషన్‌లో ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగుల బదిలీలు, పనుల కేటాయింపుల్లో సైతం అభ్యర్థి బంధువు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిణామాలతో గడచిన ఏడు నెలల్లోనే పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. చాలామంది కార్యకర్తలు పార్టీ అభ్యర్థికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో కీలక నేతలు చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గల్లా అరుణకుమారి వంటి సీనియర్ నేతలు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.



కాంగ్రెస్ మాటల యుద్ధం



కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్, ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి, దేశం అభ్యర్థిపై మాటల యుద్ధానికి దిగారు. ముఖ్యంగా చింతామోహన్ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ఏమైనా మహనీయులా? పొట్టిశ్రీరాములా? ప్రకాశం పంతులా? అల్లూరి సీతారామరాజా?..  కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని 500 కోట్లు సంపాదించారు. ’’ అంటూ వ్యాఖ్యానించడం టీడీపీ నాయకులను ఇరుకున పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కూడా రాజధాని విషయంలో అన్యాయం చేశారంటూ విమర్శిస్తున్నారు. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది.



శాప్ చైర్మన్‌గా పీఆర్ మోహన్?



 శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తికి చెందిన తెలుగుదేశం నాయకుడు పీఆర్‌మోహన్ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్‌గా నియమితులైనట్లు తెలిసింది.  చైర్మన్‌తో పాటు మరో ఆరుగురిని కమిటీ సభ్యులుగా నియమించడానికి ఎంపిక చేసినట్లు తెలిసింది. వారిలో సభ్యులుగా వెయిట్‌లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరితో పాటు మరో ఐదుగురిని నియమించినట్లు సమాచారం. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా  పీఆర్ మోహన్ శాప్ చైర్మన్‌గా పనిచేశారు.

 

 

ఏకగ్రీవం కోసం పాట్లు

 

అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయాలని ఇప్పటికే కొంతమంది నేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.  ముఖ్యంగా మద్యం షాపులు, రిక్రియేషన్ క్లబ్‌లను సైతం వదలకుండా ముఖ్యనేత మాముళ్లు వసూలు చేస్తున్నారని ఆ ప్రభావం ఎన్నికల్లో అభ్యర్థి విజయావకాశాలపై పడుతోందేమోననే భయం స్పష్టంగా కనిపిస్తోంది. కార్పొరేషన్‌లో ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగుల బదిలీలు, పనుల కేటాయింపుల సైతం అభ్యర్థి బంధువు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిమాణాలతో గడచిన ఏడు నెలల్లోనే పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. చాలామంది కార్యకర్తలు పార్టీ అభ్యర్థికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాలో కీలక నేతలు చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, గల్లా అరుణకుమారి వంటి సీనియర్ నేతలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.



కాంగ్రెస్ మాటల యుద్ధం



కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్, ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి, దేశం అభ్యర్థిపై మాటల యుద్ధానికి దిగారు. ముఖ్యంగా చింతామోహన్ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ఏమైనా మహనీయులా? పొట్టిశ్రీరాములా? ప్రకాశం పంతులా? అల్లూరి సీతారామరాజా?..  కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని 500 కోట్లు సంపాదించారు. ’’ అంటూ వ్యాఖ్యానించడం టీడీపీ నాయకులను ఇరుకున పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కూడా రాజధాని విషయంలో అన్యాయం చేశారంటూ విమర్శిస్తున్నారు. మొత్తంమీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో అధినాయకత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top