చెరువులో మద్యం ఖజానా

చెరువులో మద్యం ఖజానా - Sakshi


శ్రీకాకుళం క్రైం: టీడీపీ బ్రాండ్ మద్యం రాకెట్ ఏస్థాయిలో సాగుతోందో అరకభద్ర చె రువులో దొరికిన మద్యం ఖజానా చెప్పకనే చెబుతోంది. ఒడిశా నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని పెద్ద ఎత్తున సరిహద్దులోని ఆంధ్ర ప్రాంతాల్లోకి తరలించి అసలు సరుకుకు తీసిపోని విధంగా లేబుళ్లు పెట్టి సొమ్ము చేసుకుంటున్న మద్యం రాకెట్ గుట్టు ఈ నెల 9, 10 తేదీల్లో కొంత రట్టయింది. అధికార టీడీపీలోని అంతర్గత పోరు కారణంగా ఈ రాకెట్ గుట్టు బయటపడినప్పటికీ.. అదే పార్టీలోని రాకెట్ అనుకూల నేతల ఒత్తిళ్లతో నామమాత్రంగా పది కేసులు దొరికినట్లు కేసు నమోదు చేసి, ఒడిశా అధికారులకు అప్పగించి చేతులు దులుపుకొన్నారు. అదే సమయంలో మిగిలిన సరుకును రాకెట్ నిర్వాహకులు ప్లాస్టిక్ సంచుల్లో కట్టి అరకభద్ర చెరువులో దాచారు.

 

 ముందే సమాచారం ఉన్నా..

 వాస్తవానికి 900 కేసుల మద్యాన్ని ఒడిశా నుంచి తీసుకొచ్చి నిల్వ చేసినట్లు ఎక్సైజ్ అధికారులకు ముందే సమాచారం అందింది. అయితే దాడుల్లో పది కేసులే దొరికాయి. దాడుల సమాచారం లీక్ కావడంతో మిగి లిన కేసులను రాకెట్ నిర్వాహకులు మాయం చేశారు. అప్పట్నుంచి వాటి కోసం ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టి తిరుగుతున్నారు. అనూహ్యంగా ఆ మద్యం ఖజానా చివరికి చెరువులో దొరకడంతో విస్మయానికి గురయ్యా రు. ఆ చెరువు కూడా ఒడిశా పరి ధిలో ఉందని తేలడంతో బయటకు తీసిన సరుకును ఒడిశాక పోలీసులకు అప్పగించడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు.  మ ద్యం నిల్వలు బయటపడటానికి కూడా టీడీపీలోని వర్గపోరే కారణమని తెలిసింది. మద్యం రాకెట్ దాచి పెట్టిన నిల్వల జాడ తెలుసుకునేందుకు ఎక్సైజ్ అధికారులకంటే ఎక్కువగా టీడీపీలోని వారి వైరి వర్గమే ప్రయత్నించి నట్లు సమాచారం. ఆ నిల్వల జాడ తెలిస్తే అధికారులతో పట్టిం చి ప్రత్యర్థులపై కేసు లు పెట్టించవచ్చన్నది వారి వ్యూహం.

 

 బాబు దృష్టిలో పెట్టాలన్నదే లక్ష్యం

 నకిలీ మద్యం రాకెట్‌ను బట్టబయులు చేసి తమ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు దృష్టిలో పెట్టాలన్నదే ఓ వర్గం లక్ష్యం. రాకెట్ నిర్వహిస్తున్న వారు టీడీపీ వారే అయినప్పటికీ.. నిల్వలు బయటపడి రచ్చ అయితే నిర్వాహకులపై అధినేత చర్యలు తీసుకుంటారన్నది వారి భావన. జిల్లాలోచంద్రబాబు పర్యటన ఉండటంతో, ఆయన ఇక్కడ ఉన్న సమయంలోనే ఈ వ్యవహారం రచ్చకెక్కేలా వ్యూహం రచించారు. ఇందులో భాగంగా నకిలీ మద్యం నిల్వల్లో కొంత భాగం ఓ ప్రాంతంలో దాచి నట్టు గుర్తించారు. ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించి బుధవారం పట్టుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.



అయితే ఈ విషయం ముందుగా తెలుసుకున్న రాకెట్ నిర్వాహకులు ఆ నిల్వలను వేరే ప్రాం తానికి తరలించేందుకు ప్రయత్నించినట్టు సమాచా రం. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో ఆంధ్ర, ఒడి శా సరిహద్దులో ఉన్న అరకభద్ర గ్రామం వద్దకు ఓ ట్రాక్టరులో 300 కేసులు తీసుకెళ్లారు. అక్కడ రోడ్డుకు అవతలి వైపు ఒడిశా భూభాగంలో ఉన్న చెరువులో వాటిని డంప్ చేశారు. ఆ చెరువు ఒడిశా పరిధిలో ఉన్నందున అక్కడి ఎక్సైజ్ అధికారులే కేసు నమోదు చేస్తారని, అవసరమైతే వారిని మేనేజ్ చేసుకోవచ్చన్నది నిర్వాహకుల ఆలోచన. మద్యం నిల్వలను డంప్ చేసిన చెరువును సాధారణంగా స్థానికులు ఉపయోగించరు. కేవలం కాళ్లు చేతులు కడుక్కొవటానికే తప్ప పెద్దగా స్నానాలు కూడా చేయరు. అటువంటి చెరువులో మద్యం సీసాలు ఉన్నట్టు మొదట చెప్పిన వ్యక్తి ఓ టీడీపీ సర్పంచ్ కుమారుడే కావటం, ఆ సర్పంచే అధికారులకు సమాచారం ఇవ్వడం విశేషం. అయితే రాకెట్ నిర్వహకులను పట్టించి తమ పార్టీ అధినేత దృష్టిలో పెట్టాలనుకున్న అవతలి వర్గం ఆశలు బాబు పర్యటన రద్దుతో నేరవేరకుండా పోవడం కొసమెరుపు.

 

 మిగిలిన సరుకు ఎక్కడ...?

 ఈ వ్యవహారంలో మొత్తం 900 మద్యం కేసులు నిల్వ ఉన్నట్టు ఎక్సైజ్ అధికారుల వద్ద పక్కా సమాచారం ఉంది. పదో తేదీన జరిపిన దాడుల్లో పది కేసులే దొరికాయి. మంగళవారం చెరువులో సుమారు 300 కేసులు దొరికాయి. మరికొన్ని నిల్వలను స్థానికులు తీసుకుపోయినా.. ఇంకా మిగిలిన సరుకును ఎక్కడో నిల్వ చేసి ఉండవచ్చని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. ఆ మిగిలిన కేసులనైనా ఆంధ్ర సరిహద్దులో పట్టుకునేలా టీడీపీ అవతలి వర్గం ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఆ నిల్వలు ఎక్కడున్నాయన్నది తామే కనిపెట్టి సమాచారం అందిస్తామని, వెంటనే వచ్చి వాటిని పట్టుకోవాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఎక్సైజ్ అధికారులు దాడులకు వస్తున్నారన్న సమాచారాన్ని ఇచ్ఛాపురానికి చెందిన ఓ ఎక్సైజ్ అధికారే రాకెట్ నిర్వాహకులకు లీక్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను తదుపరి దాడుల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా సదరు వర్గం టీడీపీ కీలకనేతకు విన్నవించినట్టు తెలిసింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top