ఒక టేబుల్.. రెండు కుర్చీలు రూ. 50 వేలు


సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఒక టేబుల్, రెండు కుర్చీల ధర *50వేలు.... అలాగని మేలు జాతి కలపతోనే, వెండి పూత పూ సో వీటిని తయారు చేయలేదు. సాధారణంగా పీహెచ్‌సీల్లో కని పించే టేబుళ్లు, కుర్చీల్లాగానే వీటిని ఏర్పాటు చేశారు. కానీ వీటికైన వ్యయం మాత్రం అక్షరాలా యాభై వేల రూపాయలు. ఎం దుకింత ఖరీదంటే అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి. హెల్ప్ డెస్క్‌ల పేరిట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) నిధుల దుర్వినియోగమవుతున్నాయి. ఒక టేబుల్, ఒక కుర్చీ ఏర్పాటుకు రూ. 50వేలు ఖర్చు పెట్టొచ్చన్న ఉన్నతాధికారుల ఆదేశాల్ని కొందరు సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతా ఒక్కటై వ్యూహాత్మకం గా పెద్ద ఎత్తు నిధులు మిగుల్చుకున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.

 

 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య శ్రీ, హెల్త్‌కార్డులు, త దితర సేవల కోసం సహాయ సహకారాలు అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర క్రితం వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి పీహెచ్‌సీలో హెల్ప్‌డెస్క్ కోసం ఒక టేబుల్, ఒక కుర్చీ ఏర్పాటు చేసేందుకు రూ.50వేలు ఖర్చు పెట్టొచ్చని ఆదేశాలిచ్చింది. పీహెచ్‌సీల అభివృద్ధి నిధుల నుంచి ఈ మొత్తాన్ని డ్రా చేయాలని స్పష్టంగా పేర్కొంది. ఈ లెక్కన జిల్లాలో 68 పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలి చ్చింది. ఏపీహెచ్‌ఎంఐడీసీ ద్వారా టేబుల్, కుర్చీని ఏర్పాటు చేయిం చుకోవాలని, ఆ మేరకు రూ.50వేలు చెక్ ఇవ్వాలని సూచించి నట్టు తెలిసింది. దీంతో అప్పట్లో  కొన్ని పీహెచ్‌సీలు ముందుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన రూ.50వేలు చెల్లించి, హెల్ప్ డెస్క్ కోసం టేబుల్, కుర్చీ ఏర్పాటు చేయించుకున్నాయి.

 

  కానీ మెజార్టీ పీహెచ్‌సీలు అప్పట్లో చొరవ చూపలేదు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మరోసారి గట్టిగా చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో అన్నీ పీహెచ్‌సీలూ హెల్ప్‌డెస్క్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఈ క్రమంలో ఏపీహెచ్‌ఎంఐడీసీ అధికారులు ఒక కాంట్రాక్టర్‌ను నియమించుకుని, వారి చేత ప్రతి పీహెచ్‌సీల్లో టేబుల్, కుర్చీ తయారు చేయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం పీహెచ్‌సీల్లో కన్పిస్తున్న టేబుల్, కుర్చీ లు చూస్తుంటే వాటి విలువ రూ.20వేలు దాటి ఉండకపోవచ్చని వైద్య వర్గాలే చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న టేబుల్, కుర్చీలు కూడా పూర్తిస్థాయిలో తయారు కాలేదు. పలుచోట్ల ఫినిషింగ్ పనులు చేయకుండా వదిలేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

 

 ఈ లెక్కన ఒక్కొక్క పీహెచ్‌సీ నుంచి రూ.30వేలు చొప్పున మిగులుతాయని వైద్య వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇక సీహెచ్‌సీ(కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు)లకు రూ.లక్ష చొప్పున కేటాయిం చాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ లెక్కన ఇక్కడెంత మిగులుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  పథకం ప్రకారం తయారీ పనులు చేపట్టి, మిగులు మొత్తాన్ని వె నక్కి రప్పించుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయ మై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి స్వరాజ్యలక్ష్మీని ‘సాక్షి’ వివరణ కోరగా రూ.50వేలతో హెల్ప్ డెస్క్ కోసం టేబుల్, కుర్చీ ఏర్పా టు చేయాలని, ఆ బాధ్యతను ఏపీహెచ్‌ఎంఐడీసీకి అప్పగించినట్టు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఉత్తర్వులున్నాయన్నారు. ఉన్నత స్థాయిలో డిజైన్ చేసిన ఖర్చు అని, ఇందులో తమ ప్రమేయమేది లేదన్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top