తవ్వకాలే తరువాయి

తవ్వకాలే తరువాయి


మన్యంలో ఇక ఆపరేషన్ బాక్సైట్

కార్యాచరణకు ఉపక్రమించిన ప్రభుత్వం

{పత్యేక కమిటీలతో అనుకూల ప్రచారం

పోలీసు ఔట్‌పోస్టులతో మన్యంపై పట్టు

డిసెంబర్‌నాటికి లాంఛనాలు పూర్తి చేయాలి

రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి దిశానిర్దేశం


 

విశాఖపట్నం : బాక్సైట్ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. చింతపల్లి బ్లాక్‌లోని జెర్రెల ప్రాంతంలో 1,350 హెక్టార్లలో  246 మిలియన్ టన్నుల బాక్సైట్ తవ్వకాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఇటీవల ఆమోదం తెలి పింది. చింతపల్లి, అరకు బ్లాకుల్లోని ఇత ర ప్రాంతాల్లోని 318మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వల తవ్వకాలకు కూడా త్వరలో ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో తవ్వకాల దిశగా అత్యుత్సాహంతో ముందడుగు వేస్తోం ది. ఐటీడీయే ముసుగులో ప్రైవేటు సంస్థల ద్వారా తవ్వకాలకుం రంగం సిద్ధం చేస్తోంది.  రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)తోపాటు జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. తవ్వకాలకు అనుకూలంగా క్షేత్రస్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టాలని స్పష్టం చేశారు. దాంతో  రెవెన్యూ,  పోలీసు ఉన్నతాధికారులు సెప్టెంబరులో కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు.

 అంతా రెడీ చేయండి: ‘జెర్రెల ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు కొన్ని అనుమతులు వచ్చాయి.


మిగిలిన ప్రాంతా ల్లో కూడా తవ్వకాలకు అనుమతులు త్వర లో వస్తాయి. ఈలోగా ఏజెన్సీలో అంతా సిద్ధం చేయండి. ఏం చేయాలో తెలుసు కదా!. ఎక్కడా ఇబ్బంది రాకూడదు’అని ఇటీవల ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులను మౌఖి కంగా ఆదేశించింది.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు ఇటీవల ఏపీఎండీసీ, జిల్లా ఉన్నతాధికారులతో ఈ విషయంపై మాట్లాడినట్లు సమాచారం. ఓ వైపు ప్రత్యేక కమిటీల ద్వారా రెవెన్యూ శాఖ గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు అనుకూల పరిస్థితులు సృష్టించాలని నిర్దేశించారు. పోలీసు బలగాలతో ఏజెన్సీని పూర్తిగా అదుపులో ఉంచుకుని ఎలాంటి వ్యతిరేకత తలెత్తకుండా కట్టడి చేయాలని స్పష్టం చేశారు. అన్ని వ్యవహారాలను డిసెంబర్ నాటికి పూర్తి  చేయాలన్న లక్ష్యంతో రెవెన్యూ, పోలీసు యం త్రాంగానికి ప్రభుత్వం  కార్యాచరణను నిర్దేశించింది.

 గిరిజనుల వేళ్లతోనే: గిరిజనుల వేళ్లతోనే వారి కన్ను పొడిపించే వ్యూహానికి తెరతీసింది.  తవ్వకాలకు అనుకూలంగా ఎంపిన చేసిన టీడీపీ సానుభూతిపరులైన గిరిజనులతోనే వ్యవహారం నడపాలని వ్యూహం పన్నింది. ఇప్పటికే ఎంపిక చేసిన యువతతో కమిటీలు నియమించి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఈ కమిటీల సభ్యులను త్వరలో వివిధ ప్రాంతాల్లో పర్యటనకు తీసుకువెళతారు.



బాక్సైట్ తవ్వకాలతో ఉపాధి అవకాశాలు పెరుగాతాయనే ప్రచారాన్ని విసృ్తతం చేయడంపై వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నది ప్రభుత్వ వ్యూహం.  అనంతరం ఆ కమిటీ సభ్యులను గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాల అనుకూల ప్రచారానికి ఉపయోగించుకుంటారు. నిర్వాసితులు అయ్యే దాదాపు 6వేల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని విసృ్తతం చేయనున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన రెవెన్యూ  అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 ఏజెన్సీలోకి అదనపు బలగాలు: బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని అణచివేయడానికి భారీగా బలగాలను ఏజెన్సీలో మొహరించాలని పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఏజెన్సీలో దాదాపు 100 పోలీసు ఔట్‌పోస్టులను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఒక్కో పోస్టులో దాదాపు 100మంది సాయుధ పోలీసులు ఉంటారు. ఈ ఔట్‌పోస్టుల ఏర్పాటును నెలరోజుల్లో పూర్తి చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి జిల్లాలోకి మావోయిస్టుల రాకపోకలను పూర్తిగా నియంత్రించగలిగితే అనుకున్నది సాధించగలమన్నది వారి వ్యూహం. తద్వారా బాక్సైట్ నిల్వలున్న ప్రాంతాన్ని పూర్తిగా తమ గుప్పిట పట్టాలన్నది వారి లక్ష్యం. ఇందుకోసం సెప్టెంబరులోనే కార్యాచరణకు ఉపక్రమించనుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top