రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి - Sakshi


మంగళపాలెం(కొత్తవలస): ఇంటికి త్వరగా వెళ్లిపోవాలన్న ఆత్రుత ఆ చి న్నారుల పాలిట శాపమైంది. బస్ ఎక్కకుండా లిఫ్టు అడిగి వెళ్లిపోవాలన్న నిర్ణయం వారి పాలిట యమపాశమై చుట్టుకుంది. లారీ రూపంలో వచ్చి న మృత్యువు ఓ విద్యార్థిని అనంతలోకాలకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చింది. మంగళపాలెం జంక్షన్ సమీపంలోని జన చైత న్య లే అవుట్‌లో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. కొత్తవలస ఎస్‌ఐ ధనుంజయరావు అందించిన వివరాల మేరకు... లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామానికి చెందిన ఇ.చంద్రశేఖర్‌రాజు(13), కొత్తవలస మండలం మునగపాకవానిపాలెం గ్రామానికి చెం దిన ఎం.ఉదయ్(13)లు మంగళపాలెం సమీపంలో ఉన్న సెయింట్‌ఆన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే స్కూల్ విడిచిపెట్టాక ఇంటికి బయలుదేరారు. ఇంటికి త్వ రగా వచ్చేందుకు పెందుర్తి నుంచి కొత్తవలస వైపు వస్తున్న మోటార్‌సైక్లిస్ట్‌ను లిఫ్ట్ అడి గారు.

 

 ఆయన ఇద్దరు విద్యార్థులను ఎక్కించుకుని కొత్తవలస వైపు వస్తుండగా... జనచైతన్య లే అవుట్ సమీపంలో ఎదురుగా వ స్తున్న ఆటోను తప్పించబోయే ప్రయత్నంలో బైక్ బోల్తా పడింది. దీంతో విద్యార్థులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ లోగా కొత్తవలస నుంచి విశాఖ వైపు స్పీడుగా వెళ్తున్న లారీ విద్యార్థులను గట్టిగా ఢీకొంది. వీరిలో చంద్రశేఖరరాజు లారీ చక్రం కింద పడి నలిగిపోయాడు. ఉదయ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విద్యార్థి కోమాలోకి వెళ్లిపోవడంతో వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశమంతా భీతావహంగా మారింది. ప్రమాదంలో చనిపోయిన వి ద్యార్థి చంద్రశేఖరరాజు తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. తండ్రి ఇల్లపు సూర్యనారాయణరాజు కొంతకాలం కిందట కొత్తవలస మండలం అప్పన్నపాలెం సమీపంలో ఉన్న జేఎస్‌ఎల్ కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు.

 

 అక్కడ వేతనం సరిపోకపోవడంతో రోజువారీ కూలీగా మారారు. తల్లి బంగారమ్మ గృహిణి. ఇద్దరూ కష్టపడి బిడ్డను చదివించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడు బాగా చదువుతుండడంతో మంగళపాలెంలో ఉన్న సె యింట్ ఆన్స్ ఇంగ్లి ష్ మీడియం పాఠశాలలో చదివిస్తున్నారు. కొడుకు చనిపోయాడన్న వార్త తెలియగానే తల్లి షాక్‌కు గురైంది. తండ్రి, సోదరుడు కన్నీరు మున్నీగా విలపించారు. విషయం తెలుసుకున్న కొత్తవలస ఎస్‌ఐ ధనుంజయరావు తమ సిబ్బందితో హుటాహుటిన తరలివచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేయించి ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. పుస్తకాల్లో లభించిన ఆధారాల ప్రకారం ఇళ్లకు సమాచారం చేరవేశారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top