ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే ...

జిల్లా కలెకర్ట్ ఎదుట హల్ చల్ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ - Sakshi


నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ గొంతులో పచ్చివెలక్కాయి పడినట్లు అయింది. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే అని ఆ పార్టీ నాయకులు తలలుపట్టుకుని కూర్చున్నారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలు కైవసం చేసుకోగా టీడీపీ 15 జడ్పీటీలసు సొంతం చేసుకుంది. 'ఆపరేషన్ ఆకర్ష్' ద్వారా వైఎస్ఆర్ సీపీ చెందిన 9 మంది జడ్పీటీసీలను టీడీపీ ఆకర్షించింది. దాంతో ఇరు పార్టీలకు సమంగా జడ్పీటీసీలుగా వచ్చారు. ఏలాగైన జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ నాయకులు సమాలోచనలు చేశారు. అందులోభాగంగా ఒకరిద్దరు  వైఎస్ఆర్ జడ్పీటీసీలను ఆకర్షించాలని వ్యూహారచన చేశారు.



అందుకోసం ఎన్నికలను వాయిదా వేయాలని నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ కలెక్టర్ ఎదుట హల్చల్ చేశారు. దాంతో ఎన్నికల మరో వారానికి వాయిదా పడింది. జడ్పీ ఛైర్మన్ ఎన్నిక సజావుగా సాగేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని జిల్లాకు చెందిన న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఎన్నిక  మొత్తాన్ని విడియో తీయాలని , ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని ఆదేశించింది. ప్రత్యేక పరిశీలకుడి ఆధ్వర్యంలో జడ్పీ ఛైర్మన్ ఎన్నిక కూడా పచ్చ తమ్ముళ్లు రసాభాసగా మార్చేశారు. జడ్పీ ఛైర్మన్ ఎన్నికలను మరో సారి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో జడ్పీ ఛైర్మన్ ఎన్నికలను ముచ్చటగా మూడో సారి నిర్వహించారు.



ఈ ఎన్నికల్లోనూ ఇరు పార్టీలకూ సమానంగా ఓట్లు ఉండటంతో జడ్పీ ఛైర్మన్ పదవికి లాటరీ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఆ ఎన్నికల్లో జడ్పీ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ పదవులు వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీ సభ్యులు బి.రాఘవేంద్రారెడ్డి,పి.శిరీష వరించాయి. జడ్పీ ఛైర్మన్ పీఠం కోసం ఒకటా రెండా... ఎన్నో చేశాం... ఇంకెన్నో చేయాలనుకున్నాం. కానీ అదృష్టం మాత్రం తమకు దక్కకుండా పోయిందని పచ్చ తమ్ముళ్లు లోలోన కుమిలిపోతున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీకి కడప జడ్పీ పీఠం తప్ప మరోకటి దక్కకూడదని తెలుగు తమ్ముళ్లు వ్యవహరించినా... ఆ పార్టీ ఖాతాలోకి మూడు జడ్పీ పీఠాలు జమ అయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top