రాజకీయాలు చేస్తే.. కటకటాలే..!

రాజకీయాలు చేస్తే..  కటకటాలే..!


వారంతా చిరువ్యాపారులు..

ఏ ఆధారం లేకుండా వారి బతుకులు రోడ్డున పడ్డాయి. మంత్రితో తమ బాధలు చెప్పుకుంటే కరుణిస్తారేమోనని కుటుంబాలతో సహా  వెళ్లారు. వారిని చూసిన ఆమె మీరు మా పార్టీకి అనుకూలం కాదు. ఆ విషయం ఎప్పుడో మాకు తెలుసు. మీరంతా రాజకీయాలు చేయడం.విధ్వంసాలు చేయడం..ఇళ్లమీదకు వెళ్లడం వంటివి చేస్తే అందర్నీ పోలీస్ స్టేషన్‌లో పెట్టించి కటకటాలు లెక్కబెట్టిస్తాం అంటూ  బెదిరించడంతో ఆ చిరువ్యాపారులు చిగురుటాకుల్లా వణికిపోయారు. 

   

చీపురుపల్లి:  చీపురుపల్లి పట్టణంలోని మెయిన్‌రోడ్‌లో రెండేళ్లుగా దుకాణాలు వివాదంలో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దుకాణాలు తెరుచుకుంటాయన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ ఆరతిసాహు ఈ దుకాణాలపై కోర్టును ఆశ్రయించడంతో అవి కాస్తా తెరుచుకోలేదు. దీంతో శుక్రవారం చీపురుపల్లి వచ్చిన మంత్రి మృణాళినిని స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద 93మంది చిరు వ్యాపారులు, వారి రాజకీయాలు చేస్తే..   కటకటాలే..!



 కుటుంబాలతో సహా వచ్చి దుకాణాలే ఆధారంగా ఉన్నామని, అవి తెరుచుకోకపోతే జీవనోపాధి ఉండదని, పూటగడవక పస్తులుండాల్సి వస్తోందని, ఎలాగైనా దుకాణాలు తెరిపించాలని మంత్రికి తమ గోడు వినిపించుకున్నారు.ఎంపీటీసీతో రహస్య చర్చలు ఇంతలో అక్కడకు వచ్చిన ఎంపీటీసీ ఆరతిసాహును మంత్రి మృణాళిని, మాజీ ఎంఎల్‌ఏ కిమిడి గణపతిరావు, జెడ్‌పీటీసీ  వరహాలనాయుడు, టీడీపీ మండల ప్రెశిడెంటు రౌతు కామునాయుడులు రహస్య గదిలోకి తీసుకెళ్లారు. పది నిమిషాల తరువాత తిరిగి వచ్చిన మంత్రి  చిరు వ్యాపారులతో మాట్లాడుతూ మండిపడ్డారు.





చిరు వ్యాపారులు ఏదో చెప్పుకునేందుకు ప్రయత్నించినప్పటికీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. మీరంతా వేరే పార్టీకి అనుకూలురని తెలిసినప్పటికీ దుకాణాలు మీకు ఇవ్వొద్దని ఎంతో మంది చెప్పినప్పటికీ దుకాణాలు తెరిచేందుకు ప్రయత్నించామన్నారు. వ్యాపారులు రాజకీయాలు చేయకూడదని, సాహు నివాసంపై ఎందుకు దాడికి వెళ్లారో చెప్పాలని గద్దించారు. వ్యాపారాలు చేసుకునే వారికి రాజకీయాలు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు.



భవిష్యత్‌లో మీరు ఏ పార్టీకి ఓటు వేసినా దుకాణాలు మాత్రం తెరిపిస్తామని చివరికి ఆమె స్పష్టం చేశారు. ఒక్కొక్కరికీ ఒక్కో దుకాణం మాత్రమే ఉండాలని, మరోసారి రాజకీయాలు చేస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.  కష్టాలు చెప్పుకోడానికి వస్తే   మంత్రి నోటివెంట ఇలాంటి వ్యాఖ్యలు వినే సరికి వారంతా విస్తుపోయి వెనుదిరిగారు.  

 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top