రాజన్న రాజ్యంవైపే..చూపు..డు వేలు

రాజన్న రాజ్యంవైపే..చూపు..డు వేలు - Sakshi

  •  అన్ని నియోజక వర్గాల్లోనూ ఫ్యాన్ జోరు

  •   ప్రాంతాల్లో మరీ ఎక్కువ

  •   మూకుమ్మడి కుట్రలకు ఓటుతో చెక్!

  •  సాక్షి, విశాఖపట్నం: ఓటరు దండు కదిలింది. మూకుమ్మడి కుట్రల్ని ఎదుర్కొంది. తమ ఓట్లతో సమాధానం చెప్పింది. దివంగత మహానేత వైఎస్సార్ ఆశయ సాధకుడిని అందలం ఎక్కించేందుకు ఈవీఎంలలో తమ తీర్పును భద్రపరిచింది. జిల్లాలో ఎక్కడ చూసినా.. ఒకటే హోరు.. ఫ్యాన్ గాలి జోరు.



    టీడీపీ అభ్యర్థుల కుటిల యత్నాలను నమ్మినట్టే నమ్మించి.. గుండెల్లోనే దాచుకున్న రాజన్న పాలనను పోలింగ్ కేంద్రంలో గుర్తు చేసుకున్నారు. ‘మీ రుణం తీర్చుకునే అవకాశమీయండి’ అన్న జన నేత పిలుపుతో.. వైఎస్సార్ సీపీకి పట్టం కట్టేశారు. మా నిర్ణయం నిర్భయంగా  ఓట్ల రూపంలో చెప్పేశాం.. ఇక మిగిలింది.. ఓట్ల లెక్కింపేనంటూ.. చేతిని గాల్లో ఊపుతూ.. పోలింగ్ కేంద్రం నుంచి బయటికొచ్చినవాళ్లు కోకొల్లలు.

     

    కుమ్మక్కు నేతలకు చెక్!

     

    చరిత్రలో ఏ ఎన్నికల్లోనూ జరగని, బహుశా ఇక మీద జరిగే అవకాశంలేని పరిస్థితిని ఈ ఎన్నికల్లో ప్రజలు చూశారు. విపక్ష నేతలంతా ఒక్కటయ్యారు. కుళ్లు, కుతంత్రాలు ఏకమయ్యాయి. ఒక్కడిగా చేసి వేధించాయి. అదే ఒక్కడిని చేసి ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకు ప్రయత్నించాయి. కొన్ని చోట్ల వైఎస్సార్ సీపీ ఏజెంట్లను కూడా కొనేసి.. వారిని పోలింగ్ కేంద్రాలకు రాకుండా కుట్రలు పన్నారు. కానీ జనాభిమానం ముందు వీరి కుట్రలు పటాపంచలయ్యాయి. తూర్పు, పశ్చిమ, గాజువాక, భీమిలి నియోజక వర్గాల్లో ప్రత్యర్థి నేతలు పోలింగ్ కేంద్రాల ముందు కూడా తమ వ్యక్తుల్ని నియమించి ప్రచారంలో మునిగితేలారు.

     

    ‘విజయ’ మనదే!

     

    వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్లో విజయం పట్ల ధీమా వ్యక్తమవుతోం ది. విశాఖపట్నం లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులంతా మెజార్టీపైనే లెక్కలేసుకుంటున్నారు. ఇక్కడ ఎంపీ అభ్యర్థి విజయమ్మ కావడంతో గెలుపు ధీమా ముందునుంచే వీరిలో ఉంది. విజయమ్మకు మెజార్టీ భారీగా ఉండనుందని అంచనాలేసుకుంటున్నారు. ఎన్నికల సరళి.. స్థానికంగా కనిపిస్తున్న హడావుడితో ఉదయం నుంచే పార్టీ నేతలు ఆనందంగా ఉన్నారు.



    దీంతో ప్రత్యర్థి నేతలు కొన్ని చోట్ల చివరి నిమిషంలో కూడా ‘నోట్లు’ పంచే పనిలోపడ్డారు. అనకాపల్లి లోక్‌సభ పరిధిలో కూడా ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ మెజార్టీపైనే అంతా లెక్కలేసుకుంటున్నారు. టఫ్ ఫైట్ ఉంటుందనుకున్న నియోజక వర్గాల్లో కూడా ప్రత్యర్థులు చివరికి తేలిపోయారు. గెలుపుపై ఆశలు వదులుకున్నారు.



    కొన్ని చోట్ల ప్రత్యర్థి నేతలే ఫ్యాన్ గాలి బాగా వీస్తోందంటూ వైఎస్సార్ సీపీ శ్రేణుల ముందే చెప్పడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లోనైతే దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్‌పై తమ గుండెలోతుల్లోనున్న అభిమానమంతా ఓట్ల రూపంలో పొంగుకొచ్చింది. ఎన్నికల అధికారులు కూడా ఇదే విషయంపై చర్చించుకోవడం విశేషం.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top