శ్రీకాకుళం జిల్లా పోలాకిలో విద్యుత్ కేంద్రం

శ్రీకాకుళం జిల్లా పోలాకిలో విద్యుత్ కేంద్రం - Sakshi


రాజధాని నిర్మాణానికి జైకా సహకారం

* జపాన్‌లో పలు సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీ

* గతేడాది ఒప్పందాలపైనా సమీక్ష


సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా పోలాకి దగ్గర వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవసరమైన ప్రాథమిక అధ్యయనాన్ని జపాన్‌కు చెందిన సుమితొమి కార్పొరేషన్ పూర్తి చేసింది. అక్కడ స్థలాన్ని గుర్తించామని సంస్థ ప్రతినిధులు ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలిపారు. జపాన్‌లో తన తొలి రోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు బృందం పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యింది.



సంబంధిత వివరాలను హైదరాబాద్‌లోని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

* సుమిటోమి కార్పొరేషన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మసయకి హ్యాడో బృందంతో చంద్రబాబు బృందం సమావేశమైంది. గతేడాది నవంబరులో తన పర్యటన సందర్భంగా ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందంపై చంద్రబాబు సమీక్షించారు. విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక అధ్యయనం పూర్తి చేశామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఏపీ నూతన రాజధాని అమరావతిలో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

* క్యాపిటల్ కన్సల్టెన్సీ బిడ్‌తో పాటు విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారానికి జపాన్ ఇంటర్నేషనల్ కో- ఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) ముందుకొచ్చింది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్, కృష్ణపట్నం పారిశ్రామిక పార్కుల్లో పెట్టుబడులపై త్వరలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీలో సౌర విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్‌బ్యాంకు సిద్ధమౌతోందని, తమ మద్ధతు కోరిందని చెప్పారు.

* ఫ్యూజీ కంపెనీ ప్రతినిధులతో విజయవాడలో చేపట్టిన స్మార్ట్ గ్రిడ్ నిర్మాణ పురోగతిపై చర్చించారు.

* కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్)లో భాగంగా విశాఖపట్నంలో జపాన్ సమాచార, విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్సుబిషి సంస్థ ముందుకొచ్చింది. ఏపీలో పెట్టుబడులు పెట్టి  పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు సహకరించటంతో పాటు సామాజిక బాధ్యతా కార్యక్రమాలు చేపడతామని సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు యఘహికో కిటగవా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో మిత్సుబిషి సంస్థ నిర్మించే కర్మాగారానికి వంద రోజుల్లో  అప్రోచ్ రోడ్డు నిర్మిస్తామని చంద్రబాబు హామీనిచ్చారు.

* రాష్ర్టంలో రొయ్యలను ప్రాసెసింగ్ చేసేందుకు సహకరించాల్సిందిగా మయావక కంపెనీ ప్రతినిధులతో భేటీ సందర్భంగా చంద్రబాబు కోరారు. ఏపీలో ఆక్వా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. జపాన్‌లో డెస్క్ ఏర్పాటు చేసి పెట్టుబడిదారులకు సహకరించాల్సిందిగా మయావక కంపెనీ ఛైర్మన్ యొషిరో టనాక చేసిన విజ్ఞప్తికి చంద్రబాబు అంగీకరించారు.  

* ఈ సమావేశాల్లో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఉన్నతాధికారులు పీవీ రమేష్, అజయ్‌జైన్, ఎ.గిరిధర్, ఎస్ ఎస్ రావత్, సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top